హీరో రానా దగ్గుబాటి ఫ్యామిలీలో వెంకటేష్ తర్వాత అంతటి పేరు సంపాదించుకున్న హీరో. ఇండస్ట్రీలో హీరోగానే కాకుండా విలన్ పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రభాస్
న్యూస్ లైన్ డెస్క్: హీరో రానా దగ్గుబాటి ఫ్యామిలీలో వెంకటేష్ తర్వాత అంతటి పేరు సంపాదించుకున్న హీరో. ఇండస్ట్రీలో హీరోగానే కాకుండా విలన్ పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి చిత్రం ద్వారా క్రేజ్ సంపాదించుకున్నారు. అలాంటి రానా ఏ చిత్రం చేసినా ఏదో ఒక మెసేజ్ ఇచ్చే కథ మాత్రం ఉంటుంది. అలాంటి రానా సినిమా విషయం పక్కనపెట్టి తన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే తాను పెళ్లి చేసుకున్న అమ్మాయిని కేవలం వారం రోజుల్లో మాత్రమే ప్రేమించి పెళ్లి చేసుకున్నారట. ఆయన లవ్ స్టోరీ ఏంటో చూద్దామా..
సాధారణంగా సెలబ్రిటీల పెళ్లిళ్లు అంటే ఆకాశమంత పందిరి భూదేవంత పండగ చేస్తారు. వారి పెళ్లిళ్లను ఎంతో అంగరంగ వైభవంగా చేసుకుంటూ ఉంటారు. అలాంటి రానా మాత్రం చాలా సింపుల్ గా పెళ్లి చేసుకున్నారట. ఈయన కరోనా టైంలో తన భార్యను ఒక యాప్ ద్వారా కలిశారట. తర్వాత వారంలోనే ప్రపోజ్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారట. కరోనా సమయంలో ఇంట్లో ఉన్న రానా హౌస్ పార్టీ అనే యాప్ డౌన్ లోడ్ చేశారట.
ఈ యాప్ ద్వారా మీహికాను కలిశారట. అలా వారం రోజులు వారు వారి అభిప్రాయాలను తెలుసుకొని ఆ తర్వాత డైరెక్ట్ గా రానా పెళ్లి చేసుకుంటావా అని అడిగారట. దీంతో మిహికా ఏం చెప్పాలో తెలియక కామెడీ చేస్తున్నాడు అని అనుకుందట. ఆ తర్వాత రానా దగ్గరి వాళ్ళ ద్వారా ఈ విషయాన్ని పూర్తిగా కన్ఫామ్ చేసుకొని మిహిక కూడా పెళ్లికీ ఒప్పుకుందట. అలా వీరిద్దరూ సింపుల్ గా పెళ్లి చేసుకుని ఒకటైపోయారు. ఈ విషయాన్ని రానానే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.