రేవంత్ రెడ్డి ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో ఉండాల్సిన వ్యక్తి.. సచివాలయంలో ఉన్నాడని.. ఇది సమాజానికి మంచిది కాదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో ఉండాల్సిన వ్యక్తి అమాంతం ఆరవ అంతస్తుకు వస్తే మెదడు తికమకపడుతది.
న్యూస్ లైన్ డెస్క్ : రేవంత్ రెడ్డి ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో ఉండాల్సిన వ్యక్తి.. సచివాలయంలో ఉన్నాడని.. ఇది సమాజానికి మంచిది కాదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో ఉండాల్సిన వ్యక్తి అమాంతం ఆరవ అంతస్తుకు వస్తే మెదడు తికమకపడుతది. ఆలోచనలు తారుమారైతాయి. మాటలు వికృతమవుతాయి. తరతరాలు నాశనమైతాయి.. అని రేవంత్ రెడ్డిపై ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
ఎర్రగడ్డ మానసిక రోగ చికిత్సాలయంలో ఉండాల్సిన వ్యక్తి రాష్ట్ర సచివాలయం ఆరవ అంతస్తుకు అమాంతంగా వస్తే …
మెదడు తికమకపడతది..
ఆలోచనలు తారుమారైతవి..
మాటలు వికృతమైతవి..
తరతరాలు నాశనమైతవి..
తెలంగాణ అధోపాతాళమైతది..
తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి వికృత పదకోశం నుండి జాలువారుతున్న… pic.twitter.com/UlKc9zFCii — Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) August 20, 2024
రేవంత్ రెడ్డి వికృత భాషకు వేదిక మీద కూర్చోని నవ్వుతున్న కాంగ్రెస్ నాయకులను చూస్తే జాలేస్తుందన్నారు. ఆ బూతు పురాణాన్ని బలంవంతంగా వింటూ అమాయకంగా, అయిష్టంగా చప్పట్లు కొడుతున్న విద్యార్థుల భవిష్యత్ పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిన మీకు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టేందుకు అర్హత లేదని.. తెలంగాణ తల్లి ఆత్మ క్షోభిస్తుందని ఆయన పోస్టులో రాసుకొచ్చారు.