ఉచిత బస్సు ప్రయాణం అనేది ఇప్పటికీ కాస్త వివాదాస్పదమైన అంశమనే చెప్పుకోవాలి. ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కారణంగా బస్సుల్లో రద్దీ మరింత పెరిగింది. దీంతో మహిళలే కాకుండా పురుష ప్రయాణికులకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అటు ప్రయాణికులే కాకుండా మరోవైపు డ్రైవర్లు, కండక్టర్లకు కూడా బస్సులను నడపడం పెద్ద సవాల్‌గా మారింది. ఇదంతా ఒకెత్తయితే.. డబ్బు లేకుండా బస్సులను నడపడం ఆర్టీసీకి మరో సమస్యగా మారినట్లు తెలుస్తోంది.
న్యూస్ లైన్ డెస్క్: కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడి సీఎం సిద్దరామయ్య.. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పించారు. దీంతో మహిళలకు కేఎస్ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే అవకాశం దక్కింది. అయితే, మహిళలు ప్రయాణించేందుకు అయిన ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది.
అయితే, ఉచిత బస్సు ప్రయాణం అనేది ఇప్పటికీ కాస్త వివాదాస్పదమైన అంశమనే చెప్పుకోవాలి. ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కారణంగా బస్సుల్లో రద్దీ మరింత పెరిగింది. దీంతో మహిళలే కాకుండా పురుష ప్రయాణికులకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అటు ప్రయాణికులే కాకుండా మరోవైపు డ్రైవర్లు, కండక్టర్లకు కూడా బస్సులను నడపడం పెద్ద సవాల్‌గా మారింది. ఇదంతా ఒకెత్తయితే.. డబ్బు లేకుండా బస్సులను నడపడం ఆర్టీసీకి మరో సమస్యగా మారినట్లు తెలుస్తోంది.
మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వమే భరించనున్నట్లు ఒప్పందం చేసుకున్నప్పటికీ ఆర్టీసీకి తీవ్ర నష్టం వాటిల్లుతున్నట్లు సమాచారం. కర్ణాటకలో ఫ్రీ బస్సు పథకం వల్ల కేఎస్ఆర్టీసీకి రూ.295 కోట్ల నష్టం వాటిల్లినట్లు అక్కడి మీడియా తెలిపింది. దీంతో ఆ నష్టాన్ని పూడ్చేందుకు ప్రభుత్వం సకలవిధాలా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ పూర్తిగా నష్టపోకుండా ఉండేందుకు టికెట్ రేట్లు 15 నుండి 20 శాతం పెంచే ఆలోచనలో కేఎస్ఆర్టీసీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కర్ణాటకలో అమలు చేసినట్లుగానే తెలంగాణలో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పించారు. ఇక్కడ కూడా ఆర్టీసీ నష్టాల్లోనే కొనసాగుతోందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇక్కడ కూడా ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.