Big boss8:నాగార్జునకి సమంత సాయం.. మర్చిపోలేరు.!

బిగ్ బాస్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో రియాలిటీ షో గా ఎంతో గుర్తింపు పొందింది.  ఇప్పటికే ఏడు సీజన్స్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ 8వ సీజన్ సెప్టెంబర్ 1 సాయంత్రం ఏడు గంటలకు


Published Sep 01, 2024 03:11:43 PM
postImages/2024-09-01/1725183703_nag1.jpg

న్యూస్ లైన్ డెస్క్: బిగ్ బాస్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో రియాలిటీ షో గా ఎంతో గుర్తింపు పొందింది.  ఇప్పటికే ఏడు సీజన్స్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ 8వ సీజన్ సెప్టెంబర్ 1 సాయంత్రం ఏడు గంటలకు అట్టహాసంగా ప్రారంభం కాబోతోంది. ఈ సీజన్ లో కూడా హోస్ట్ గా నాగార్జున చేస్తున్నట్టు తెలుస్తోంది. మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 8  పురస్కరించుకొని గత సీజన్ లో జరిగినటువంటి కొన్ని విషయాలను అభిమానులు షేర్ చేస్తున్నారు. ఈ మాజీ కోడలు సమంత మామకు చేసిన సాయాన్ని కూడా మరోసారి రివీల్ చేస్తున్నారు.ఆ వివరాలు ఏంటో చూద్దాం.

బిగ్ బాస్ మూడో సీజన్ నుంచి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నారు. అంతకుముందు నాని ఎన్టీఆర్ హోస్ట్ గా చేశారు. ఆ తర్వాత నాగార్జుననే కంటిన్యూ చేస్తూ వస్తున్న సమయంలో బిగ్బాస్ సీజన్ 4లో సమంత కూడా హోస్ట్ గా ఒక మెరుపు మెరిసింది.  అయితే నాలుగో సీజన్ ఏడవ వారం వీకెండ్ లో నాగార్జున షూటింగ్ కారణంగా విదేశాలకు వెళ్ళాడు.  దీంతో మామగారి కోసం మాజీ కోడలు సమంత టెంపరరీ హోస్టుగా పనిచేసింది.

అయితే సమంతకు ఇదివరకు పలు షోలలో హోస్ట్ గా చేసిన అనుభవం ఉంది కాబట్టి దాంతో ఆ వీకెండ్ ను అద్భుతంగా మార్చగలిగింది. అంతేకాదు సమంతకు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల ఆమె చేసిన ఎపిసోడ్ 11.4 టిఆర్పి రేటింగ్ సంపాదించి రికార్డు క్రియేట్ చేసింది. అంటే అప్పటివరకు అంతా టిఆర్పి  ఎప్పుడు రాలేదు. సమంత కనిపించిన రెండు రోజులే అంత టీఆర్పీ రేటింగ్ రావడంతో  ఆమె క్రేజ్ ఏంటో నాగార్జునకు అర్థమైంది. బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో 18.1 టిఆర్పి రేటింగ్ వచ్చింది. మరి ఈ 8లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

newsline-whatsapp-channel
Tags : jr-ntr nagarjuna samantha nani big-boos8 pallavi-prashanth

Related Articles