అక్కినేని ఫ్యామిలీలో రెండు పెళ్లిళ్లు అనేవీ నాగార్జున నుంచే మొదలయ్యాయి. ముఖ్యంగా నాగార్జున ముందుగా లక్ష్మీని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి అమలను రెండో పెళ్లి
న్యూస్ లైన్ డెస్క్: అక్కినేని ఫ్యామిలీలో రెండు పెళ్లిళ్లు అనేవీ నాగార్జున నుంచే మొదలయ్యాయి. ముఖ్యంగా నాగార్జున ముందుగా లక్ష్మీని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి అమలను రెండో పెళ్లి చేసుకున్నారు. ఆ విధంగానే తన కొడుకు నాగచైతన్య కూడా ముందుగా సమంతాను ప్రేమించి పెళ్లి చేసుకొని నాలుగేళ్లు కాపురం చేసిన తర్వాత విడాకుల ద్వారా దూరమైపోయారు. అలా సమంత నాగచైతన్య దూరమైన తర్వాత ఎవరి దారి వారు చూస్తున్నారు.
అలా ఇద్దరు సినిమాలపై దృష్టి పెట్టి కెరీర్ లో దూసుకుపోతున్న తరుణంలోనే నాగచైతన్య మరో హీరోయిన్ తో ప్రేమలో పడ్డారని అనేక వార్తలు వినిపించాయి. ఇద్దరు కలిసి వవెకేషన్స్ కి వెళ్తున్నారని వీరు త్వరలో పెళ్లి చేసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ తాజాగా శోభిత ధూళిపాళ్ల నాగచైతన్యల నిశ్చితార్థం బంధుమిత్రుల మధ్య జరిగింది. దీంతో వీరి ప్రేమ వ్యవహారం బయటపడింది. అయితే వీరి ప్రేమ ఎక్కడ మొదలైంది ఎలా కలిశారు అనేదానిపై తాజాగా శోభిత చెల్లి సమంత ఇన్స్టాలో పోస్ట్ ద్వారా క్లారిటీ ఇచ్చింది.
అయితే వీరి మధ్య లవ్ 2022లో మొదలైందని శోభిత చెల్లి సమంత అన్నది. అప్పటినుంచి వీరిద్దరూ సీక్రెట్ గా కలవడం వెకేషన్స్ కి వెళ్లడం చేస్తున్నారని తెలియజేసింది. ఈ పెళ్లి విషయమై ఇద్దరి మధ్య సఖ్యత కుదిరిన తర్వాతే ఇంట్లో ఒప్పించి నిశ్చితార్థం చేశారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అన్నది.
https://www.instagram.com/p/CeNgIF2K4aO/?utm_source=ig_web_copy_link
ప్రస్తుతం శోభిత చెల్లి సమంత ఈ విధంగా వీరి లవ్ కు సంబంధించిన విషయాన్ని బయటపెట్టి వారి ఫోటోలను సోషల్ మీడియా ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. ఇది కాస్త వైరల్ అవుతుంది. ఇందులో సమంత అంటే నాగచైతన్య మొదటి భార్య సమంత అని చాలామంది అనుకుంటారు. కానీ సమంత అంటే శోభిత ధూళిపాళ్ల చెల్లి. ఆమె పేరు కూడా సమంత కావడంతో ఈ పోస్టు చాలా వైరల్ అవుతుంది..