Sanjay Dutt : బర్త్ డే సందర్భంగా కొత్త కారు కొన్న సంజూ భాయ్

తన పుట్టినరోజు సందర్భంగా సంజూ భాయ్ తనకు తానే కోట్ల విలువైన బహుమతి ఇచ్చుకున్నాడు. రూ.4 కోట్ల రేంజ్ రోవర్ కారును కొని.. తన లగ్జరీ లైఫ్ స్టైల్ ని మరోసారి ప్రదర్శించుకున్నాడు.


Published Jul 30, 2024 08:04:58 AM
postImages/2024-07-30/1722344681_sanjayduttcar.jpg

న్యూస్ లైన్ డెస్క్ : బాలీవుడ్ తో పాటు.. టాలీవుడ్, కోలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న సీనియర్ స్టార్ సంజయ్ దత్. కేజీఎఫ్ సినిమాతో విలన్ గా అదరగొట్టి.. లియో సినిమాలో విజయ్ తో తలపడి మరోసారి మెప్పించి సౌత్ ప్రేక్షకుల ప్రేమను గెలుచుకున్నాడు. ప్రస్తుతానికైతే తన ఫోకస్ మొత్తం సౌత్ ఇండస్ట్రీ మీదనే పెట్టిన సంజూభాయ్ తన 65వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోనున్నాడు.

తన పుట్టినరోజు సందర్భంగా సంజూ భాయ్ తనకు తానే కోట్ల విలువైన బహుమతి ఇచ్చుకున్నాడు. రూ.4 కోట్ల రేంజ్ రోవర్ కారును కొని.. తన లగ్జరీ లైఫ్ స్టైల్ ని మరోసారి ప్రదర్శించుకున్నాడు. ఇప్పటికే ఆయన గ్యారేజీలో కొన్ని లగ్జరీ కార్లు ఉన్నాయి. తాజా కారుతో మరో లగ్జరీ వచ్చి చేరింది. సంజయ్ దత్ కొత్త కారు ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ తెలుగు మూవీ డబుల్ ఇస్మార్ట్. ఈ సినిమాలో సంజూ భాయ్ ప్రతినాయక పాత్రలో నటించారు. బిగ్ బుల్ అనే పేరుతో మాస్ విలన్ గా సంజూభాయ్ తెరపై అదరగొడుతారంటున్నారు దర్శకుడు పూరీ జగన్నాధ్. ఈ మధ్యే విడుదలైన టీజర్ లో సంజయ్ దత్ లుక్స్ సినిమా మీద అంచనాలు పెంచేశాయి.

 

newsline-whatsapp-channel
Tags : movies movie-news bollywood- bolly-wood latest-news telugu-news bollywood

Related Articles