Nani:"సరిపోదా శనివారం" ఫస్ట్ డే కలెక్షన్స్ అదుర్స్.!

నాని హీరోగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా వచ్చినటువంటి  మూవీ "సరిపోద శనివారం.ఈ చిత్రం వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో  తెరకెక్కింది. ఈ సినిమా గురువారం  థియేటర్లోకి వచ్చిన విషయం అందరికీ


Published Aug 30, 2024 03:42:03 PM
postImages/2024-08-30/1725012723_saripodashanivaram.jpg

న్యూస్ లైన్ డెస్క్: నాని హీరోగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా వచ్చినటువంటి  మూవీ "సరిపోద శనివారం.ఈ చిత్రం వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో  తెరకెక్కింది. ఈ సినిమా గురువారం  థియేటర్లోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ సెకండ్ షో ల వరకు సినిమా గురించి మిక్స్డ్ టాక్ బయటకు వచ్చింది.

అయినా ఈ సినిమాపై మాత్రం మంచి అంచనాలే ఉండడంతో కలెక్షన్స్ కూడా వచ్చినట్టు తెలుస్తోంది. మరి అలాంటి సరిపోదా శనివారం సినిమా  ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత వచ్చాయి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

 అధికారికంగా కలెక్షన్స్ విషయం బయటకు రాకపోయినా కానీ సినీ ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం  సరిపోదా శనివారం మొదటి రోజు  9 కోట్లకు పైగానే కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా  ఇండియాలోని మిగతా ప్రాంతాలలో కూడా నాలుగు కోట్ల వరకు గ్రాస్ ఓవర్సీస్ లో ఏడు కోట్ల వరకు కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.

ఇలా మొత్తం మొదటి రోజు సరిపోదా శనివారం చిత్రం  20 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్టు సమాచారం అందుతుంది. ప్రస్తుతం వీకెండ్ ఉండడంతో పెద్ద సినిమాలు ఏమీ కూడా థియేటర్లో లేకపోవడంతో, సినిమా కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు నాని కెరియర్ లో దసరా సినిమా మాత్రమే ఫస్ట్ డే కలెక్షన్స్ 38 కోట్లు వసూలు చేసింది. ఇక అప్పటినుంచి ఏ సినిమా కూడా ఈ రికార్డును దాటలేదు

newsline-whatsapp-channel
Tags : news-line nani saripoda-shanivaram dussera priyanka-mohan 1st-day-collections

Related Articles