మన హిందూ సంప్రదాయం ప్రకారం జ్యోతిశ్య శాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటాం. ఈ శాస్త్రం ప్రకారం ఎలాంటి పనులు చేయాలన్న మంచి రోజులను బట్టి చేస్తూ ఉంటాం. అలాంటి జ్యోతిష్య శాస్త్రం
న్యూస్ లైన్ డెస్క్: మన హిందూ సంప్రదాయం ప్రకారం జ్యోతిశ్య శాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటాం. ఈ శాస్త్రం ప్రకారం ఎలాంటి పనులు చేయాలన్న మంచి రోజులను బట్టి చేస్తూ ఉంటాం. అలాంటి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ మాసం ఈ కొన్ని రాశుల వారికి బాగా కలిసి వస్తుందట. సాధారణంగా బుధ, శుక్ర గ్రహ సంచారం వల్ల కొన్ని రాశుల వారికి శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడుతూ ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పంచా మహాపురుష యాజయోగంలో ఒకటి మాలవ్య రాజయోగంగా చెప్పబడింది. సెప్టెంబర్ నెలలోనే భద్ర రాజయోగం కూడా ఏర్పడుతున్నది. ఈ రెండు రాజయోగాల వల్ల ఈ రాశుల వారికి సెప్టెంబర్ లో ధనవంతులయ్యే అవకాశం కనిపిస్తోంది. మరి వారెవరో ఇప్పుడు చూద్దాం.
#1. కర్కాటక రాశి:
భద్ర, మాలవ్య యోగాలకు వల్ల ఈ రాశి వారికి అన్ని శుభ ఫలితాలే ఉంటాయట. అంతేకాకుండా సెప్టెంబర్ నెల నుంచి వీరికి శుభ ఘడియలు మొదలవుతాయని శుక్రుడు, బుధుడు కర్కాటక రాశి వారికి అమిత ఆనందాలను కలిగిస్తాడని అంటున్నారు. ఇప్పటినుంచి వీరు లగ్జరీ లైఫ్ ని లీడ్ చేస్తారట. ఆస్తి వివాదాలు కూడా తేలిపోతాయట. సొంత కుటుంబీకులతో సంబంధాలు మెరుగుపడి జీవిత భాగస్వామితో కూడా అద్భుతంగా జీవిస్తారని అంటున్నారు. సెప్టెంబర్ నుంచి వీరికి అన్ని శుభ ఫలితాలే వస్తాయని పండితులు అంటున్నారు.
#2. మకర రాశి:
ఈ రాజయోగం వల్ల మకరరాశిలో పుట్టిన వారందరికీ మేలైన ఫలితాలు ఉంటాయట. బుధ, శుక్ర గ్రహ అనుగ్రహంతో వ్యాపారాలు, ఉద్యోగాలు చేసేవారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయని అంటున్నారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు ప్రమోషన్ పొందుతారట. ఏదైనా పెండింగ్ బిల్లులు పనులు ఉంటే తొందరగా పూర్తయి లాభాలను అర్జిస్తారని జ్యోతిష్య పండితులు అంటున్నారు.
#3.మిధునరాశి:
భద్ర, మాలవ్య రాజయోగల వల్ల ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయట.ఇన్ని రోజుల నుంచి కష్టాలు అనుభవించిన ఈ రాశి వారు సెప్టెంబర్ నుంచి శుభ ఫలితాలను పొందుతారట.లగ్జరీ లైఫ్ కడుపుతారని, ఆస్తులు కూడా కొనుగోలు చేస్తారని అంటున్నారు. ముఖ్యంగా జీవిత భాగస్వామితో ఏవైనా గొడవలు ఉంటే అవన్నీ క్లియర్ అవుతాయని ఆస్తుల పంపకాలు కూడా జరగబోతున్నాయని అంటున్నారు. ముఖ్యంగా ఈ నెల నుంచి ఈ రాశి వారు అన్ని శుభవార్తలే వింటారని తెలియజేస్తున్నారు.