Coolie : ప్రీతి ఎలా ఉంటుందంటే.. కూలీలో శృతి హాసన్ లుక్


Published Aug 30, 2024 07:56:43 PM
postImages/2024-08-30/1725028003_shuriHasa.jpg

న్యూస్ లైన్ డెస్క్ :  కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ రూపొందిస్తున్న మూవీ కూలీ. సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది. షూటింగ్ దశలో ఉన్న కూలీ మూవీకి సంబంధించి ప్రచార చిత్రాలకు సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోంది.

తాజాగా మూవీ మేకర్స్ శృతి హాసన్ లుక్ కి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో శృతి హాసన్ ప్రీతి పాత్రలో కనిపించనుంది. ఇదే విషయాన్ని రివీల్ చేస్తూ మేకర్స్ పోస్టర్ విడుదల చేశారు. సన్ పిక్చర్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : rajinikanth tollywood movie-news kollywood sruthi-haasan latest-news lokesh-kanakaraj sruthihassan

Related Articles