రచయిత వైరముత్తు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని చిన్మయి పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. చిన్నపిల్లలు, మహిళలపై చిన్న ఘటన తన దృష్టికి వచ్చినా ఆమె స్పందిస్తోంది.
రచయిత వైరముత్తు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని చిన్మయి పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. చిన్నపిల్లలు, మహిళలపై చిన్న ఘటన తన దృష్టికి వచ్చినా ఆమె స్పందిస్తోంది. తాజాగా యాంకర్ అనసూయ భరద్వాజ్ కి సంబంధించిన ఘటనపై చిన్మయి సోషల్ మీడియాలో ఘాటుగానే స్పందించింది. ఈ మధ్య యాంకర్ అనసూయ ఓ రియాలిటీ షోలో చేస్తోంది. అది చిన్నపిల్లల షో. ఆ షోలో అనసూయ ఓ చిన్న పిల్లాడిని ఎత్తకొని బుగ్గపై, నుదుటిపై, పెదాలపై ముద్దు పెట్టమని అడుగుతుంది. అభం శుభం తెలియని ఆ పిల్లాడు అనసూయ పెదాలపై ముద్దు పెడతాడు.
ఈ విషయమై ఇప్పటికే సోషల్ మీడియాలో అనసూయపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. ఆమె చేసింది సెక్సువల్ అఫెన్స్ అంటూ పలువురు మండిపడుతున్నారు. చిన్న పిల్లలకు ఏది గుడ్ టచ్.. ఏది బ్యాడ్ టచ్ అనేది నేర్పాల్సింది పోయి.. అలా లిప్ కిస్ పెట్టమనడం తప్పు కాదా అంటూ చిన్మయి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. అనసూయ సెక్సువల్ అబ్యూజ్ కి పాల్పడటం దారుణం.. ఒక సెలెబ్రిటీ అయి ఉండి.. పదిమందికి చైల్డ్ అబ్యూజ్ గురించి చెప్పాల్సిన ఆమె ఇలా చేయడం తగదంటూ బాలల హక్కుల సంఘాలు, పేరెంట్స్ సంఘాలు మండిపడుతున్నాయి.