Sobhita dhulipala: వేశ్యగా మారిన శోభిత..ఆమెతో చైతూ పెళ్లా.?

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా  నాగచైతన్యకు సంబంధించిన వార్త వైరల్ అవుతుంది. అక్కినేని హీరో నాగచైతన్య  కథానాయిక శోభిత ధూళిపాళ్లతో ఆయనకు  ఆగస్టు 8వ తేదీన ఎంగేజ్మెంట్ జరగబోతుందని వార్త 


Published Aug 08, 2024 02:10:32 PM
postImages/2024-08-08/1723106432_nagachaithanya.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా  నాగచైతన్యకు సంబంధించిన వార్త వైరల్ అవుతుంది. అక్కినేని హీరో నాగచైతన్య  కథానాయిక శోభిత ధూళిపాళ్లతో ఆయనకు  ఆగస్టు 8వ తేదీన ఎంగేజ్మెంట్ జరగబోతుందని వార్త విపరీతంగా వైరల్ అవుతుంది. మరి ఇది నిజమేనా ఆ వివరాలు ఏంటో చూద్దాం.. నాగచైతన్య  తెలుగు సినిమా ఇండస్ట్రీలో  ఓ మోస్తారు హీరోగా కొనసాగుతున్నారు.

ఈయన హీరోయిన్ సమంతను పెళ్లి చేసుకొని కొన్నేళ్లపాటు సంసారం చేసి ఆ తర్వాత విడాకులు తీసుకొని విడిపోయారు. ప్రస్తుతం సినిమాలపై దృష్టి పెట్టి దూసుకుపోతున్నటువంటి నాగచైతన్య  గత కొంతకాలంగా శోభిత ధూళిపాలతో ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది. వీరిద్దరూ కలిసి పలు వేకేషన్స్ కూడా వెళ్లి సీక్రెట్ గా  ఎంజాయ్ చేసినట్టు కూడా వార్తలు వచ్చాయి.  అలాంటి ఈ జంట నిశ్చితార్థం జరుగుతోందని  త్వరలో వీరి పెళ్లికూడా చేసుకోబోతున్నారని ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.

ఇదిలా ఉండగానే  తాజాగా శోభిత ధూళిపాల గురించి మరో వార్త వైరల్ అవుతుంది.  అక్కినేని ఫ్యామిలీ అంటే ఇండస్ట్రీలో ఎంతో గౌరవం ఉంటుంది. అలాంటి ఈ ఫ్యామిలీ నుంచి అక్కినేని నాగచైతన్య  వేశ్య పాత్ర చేసినటువంటి శోభితా ధూళిపాలను చేసుకోవడం  ఆశ్చర్యం అంటూ కొంతమంది అంటున్నారు. ఈమె చాలా సినిమాల్లో బోల్డ్ పాత్రలు చేసిందని  తెలియజేస్తున్నారు. స్లమ్ డాగ్ మిలీనియర్ ఫేమ్ దేవ్ పటేల్ హీరోగా  వచ్చిన మంకీ మ్యాన్ చిత్రంలో వేశ్యగా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఈ పాత్ర ఎంతో బోల్డ్ గా ఉంటుంది. ఈ మూవీ అంతగా ఆడలేదు కాబట్టి చాలామందికి ఆమె పాత్ర గురించి తెలియలేదు. అలాంటి ఈమెతో నాగచైతన్య  నిశ్చితార్థం అని వార్తలు రావడంతో చాలామంది అక్కినేని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇక నాగార్జున చైతూ, శోభీత నిశ్చితార్థం ఈరోజు 9:42..గంటలకు జరిగింది అని అధికారికంగా వెల్లడించారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu nagarjuna samantha nagachaitanya engagement sobhita-dhulipala

Related Articles