తాజాగా సమంత మాజీ భర్త నాగచైతన్యను శోభిత ధూళిపాల రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయింది. ఇప్పటికే ఈరోజు ఉదయాన్నే నాగచైతన్య శోభితల ఎంగేజ్మెంట్ ఘనంగా అక్కినేని ఫ్యామిలీ మధ్య జరిగింది. అయితే వీరి
న్యూస్ లైన్ డెస్క్: తాజాగా సమంత మాజీ భర్త నాగచైతన్యను శోభిత ధూళిపాల రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయింది. ఇప్పటికే ఈరోజు ఉదయాన్నే నాగచైతన్య శోభితల ఎంగేజ్మెంట్ ఘనంగా అక్కినేని ఫ్యామిలీ మధ్య జరిగింది. అయితే వీరి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలు ఎక్కువగా బయటికి రాలేదు. కేవలం నాగార్జున శోభిత నాగచైతన్యకి సంబంధించిన ఒక ఫోటో అలాగే నాగార్జునతో వాళ్ళిద్దరూ ఉన్న ఒక ఫోటో రెండు ఫోటోలు మాత్రమే బయటపెట్టారు.
ఇక వీరి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలు ఇంకా బయటికి రాలేదు. అయితే నాగచైతన్య సడన్ గా శోభితను ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే నేపథ్యంలో వీరిద్దరికి సంబంధించిన కొన్ని పాత వీడియోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.అందులో భాగంగా సమంత గురించి గతంలో శోభిత ధూళిపాల మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారాయి.
అయితే ఓ ఈవెంట్లో శోభిత కి సమంత గురించి ప్రశ్న ఎదురవగా సమంత ఒక స్ట్రాంగ్ ఉమెన్.ఆమె ఎంచుకునే పాత్రలు నాకు ఎంతగానో నచ్చుతాయి. సినిమా ఇండస్ట్రీలో ఆమె ఎన్నో విభిన్న పాత్రలు పోషిస్తూ ఒక కొత్త అధ్యయనానికి తెరలేపింది. ఈమె ఫిల్మోగ్రఫీ సూపర్. ఆమె కెరీర్ కూడా చాలా అద్భుతంగా ఉంది.. అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. అదే ఇంటర్వ్యూలో నాగచైతన్య గురించి చెబుతూ..
నాగచైతన్య చాలా కామ్ పర్సన్..ఏ వ్యవహరమైన సరే చాలా కూల్ గా పరిష్కరించుకుంటాడు.అలాగే తన
ప్రపంచంలో తాను ఎంజాయ్ చేస్తూ తన జీవితంలో తాను ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవాలో ఆచి చూచి అడుగులు వేస్తారు. అంటూ మాట్లాడింది.అయితే అప్పటి ఓల్డ్ వీడియో మరోసారి నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది