Garikapati : పెద్ద ఎన్టీఆర్ ముక్కుపై.. గరికపాటి కామెంట్స్ వైరల్..!

సీనియర్ ఎన్టీఆర్  తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని   ఎల్లలు దాటించినా ఏకైక నటుడు. కేవలం సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా ఈయనను మించిన ఘనుడు లేడని చెప్పవచ్చు.  రాజకీయ


Published Aug 27, 2024 06:20:09 AM
postImages/2024-08-27/1724752534_garikapati.jpg

న్యూస్ లైన్ డెస్క్: సీనియర్ ఎన్టీఆర్  తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని   ఎల్లలు దాటించినా ఏకైక నటుడు. కేవలం సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా ఈయనను మించిన ఘనుడు లేడని చెప్పవచ్చు.  రాజకీయ పార్టీని స్థాపించి కేవలం సంవత్సరంలోపే అధికారంలోకి వచ్చిన దురంధరుడు. అలాంటి ఎన్టీఆర్ తెలుగువారి కీర్తిని ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేసిన గొప్ప నటుడు.  అలాంటి మహా మనిషి గురించి ప్రతిరోజు ఏదో ఒక దగ్గర గుర్తు చేసుకుంటూనే ఉంటారు. అయితే రీసెంట్ గా గుంటూరులో ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ ఐదు సంవత్సరాలు పుట్టిన సందర్భంగా కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ గురించి ఆయన ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు. నాకు ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టమని, ఆయన తెలుగువారి గుండెల్లో శ్రీకృష్ణదేవరాయలుగా కొలువై ఉన్నారని అన్నారు. అంతేకాదు ఆయన శ్రీకృష్ణదేవరాయలు పాత్ర చూస్తే మాత్రం నిజంగానే దేవుడిలా కనిపిస్తారు.  మీ పిల్లలకి ఆయన ఫోటో చూపించి ఈయన శ్రీకృష్ణ దేవాలయాలు అని చెప్పండి.  ఆ విధంగా తెలుగు ప్రజల గౌరవాన్ని ఎంతో దూరం తీసుకెళ్లిన ఎన్టీఆర్ 1970 సమయంలో  బాలీవుడ్ నుంచి కొంతమంది నిర్మాతలు వచ్చి కోటి రూపాయల పారితోషకం ఇస్తాం.

రాముడు వేషం వేస్తావా అని అడిగారట. దీంతో ఎన్టీఆర్ రిజెక్ట్ చేశారట. ఒక పది లక్షలు ఇవ్వండి తెలుగులోనే చేద్దామని అన్నారట. దీన్నిబట్టి చూస్తే ఎన్టీఆర్ కు తెలుగు వారు అంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎన్టీఆర్ లాంటి ముక్కు ఎవరికి రాదని, ఆయనది కోటేరు ముక్కని,  పదహారేళ్ల అమ్మాయి అయినా ఆ ముక్కు చూసి ఎన్టీఆర్ వెనుక పడాల్సిందే అని అన్నారు.  అలాంటి ముక్కు ఉన్నటువంటి భర్త ఆ భార్య జన్మల అదృష్టం కలిగి ఉంటుందని అన్నారు. ఆయన ఎన్టీఆర్ ముక్కు గురించి ఈ విధంగా చెప్పడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

newsline-whatsapp-channel
Tags : tdp news-line sr-ntr garikapati sri-krishna-devaraya mukku

Related Articles