Divorce: స్టార్ హీరో విడాకులు.. కారణం ఆమెనేనా.?

ఈ మధ్యకాలంలో ఎంతోమంది సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటూ వారి పచ్చని సంసారాన్ని చిన్న చిన్న మనస్పర్థలతో కూల్చేసుకుంటున్నారు. పెళ్ళై చాలా సంవత్సరాలైనా.. ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నా కనీసం వారి 


Published Sep 09, 2024 01:40:00 PM
postImages/2024-09-09/1725869400_ravi.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఈ మధ్యకాలంలో ఎంతోమంది సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటూ వారి పచ్చని సంసారాన్ని చిన్న చిన్న మనస్పర్థలతో కూల్చేసుకుంటున్నారు. పెళ్ళై చాలా సంవత్సరాలైనా.. ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నా కనీసం వారి కోసమైనా కలిసి ఉండడం లేదు. తాజాగా ఓ స్టార్ హీరో కూడా విడాకులకు రెడీ అయ్యారు.. అయితే ఈ హీరో విడాకులు తీసుకోబోతున్నట్టు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.

కానీ దానిపై క్లారిటీ లేదు.కానీ తాజాగా దానిపై క్లారిటీ వచ్చేసింది. ఇక విడాకులు తీసుకుంటున్న ఆ హీరో ఎవరో కాదు తమిళ్ స్టార్ హీరో జయం రవి.అవును మీరు వినేది నిజమే.. జయం రవి తన భార్య ఆర్తితో విడాకులు తీసుకోబోతున్నట్టు అఫీషియల్ గా ప్రకటించేశాడు. అయితే గత కొద్ది రోజులుగా వీరిద్దరూ విడిపోతున్నట్టు కోలీవుడ్లో టాప్క్ వినిపించినప్పటికీ దానిపై క్లారిటీ ఇవ్వలేదు.

తాజాగా జయం రవి ఈ విషయంపై మేం విడిపోతున్నాం అంటూ అధికారికంగా చెప్పాడు. వ్యక్తిగత విషయాల కారణంగానే మేము విడాకులు తీసుకున్నాం.దీనిపై ఎవరు రూమర్స్ క్రియేట్ చేయకండి అని చెప్పుకొచ్చారు. ఇక 2009లో ఆర్తిని పెళ్లాడిన జయం రవి ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు.

వీరికి ఆరవ్,అయాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇక పెళ్లయిన 15 సంవత్సరాల కు ఈ జంట విడాకులు తీసుకోవడంతో చాలామంది వీరి అభిమానులు షాక్ అవుతున్నారు. అయితే వీరి విడాకుల కారణం ఏమై ఉండొచ్చు అనే కోణంలో కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు.

https://x.com/actor_jayamravi/status/1833030619481444611

newsline-whatsapp-channel
Tags : newslinetelugu kollywood jayam-ravi aarthi jayam-ravi-divorce

Related Articles