Chiranjeevi:మెగాస్టార్ అడ్డుకోకుంటే సురేఖ కలెక్టర్ భార్య అయ్యేదా.?

నేడు నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది. నీతి ఆయోగ్‌ 9వ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షత వహించనున్నారు. 
 


Published Jul 26, 2024 11:47:41 PM
postImages/2024-07-27/1722054776_WhatsAppImage20240721at10.16.10AM.jpeg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీకి  ప్రస్తుతం బిగ్ బాస్ ఎవరయ్యా అంటే చాలామంది మెగాస్టార్ చిరంజీవి అంటారు. కానీ చిరంజీవి ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం.  అలా ఎందుకు సింపుల్ గా ఉంటారు అంటే ఆయన చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలనుభవించారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఒక్కో మెట్టు ఎక్కుతూ, ఈ స్థాయికి చేరుకున్నారు. అలాంటి చిరంజీవి ఇంతటి స్థాయికి రావడానికి పడ్డ కష్టాలు ఏమిటి? ఆయన పెళ్లి వెనుక ఉన్నటువంటి సమస్యలేంటి అనే వివరాలు చూద్దాం.

చిరంజీవి ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత  అల్లు రామలింగయ్య కూతురు సురేఖని వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకునే సమయానికి చిరంజీవి చిన్న హీరో. ఆయన అసలు ఇండస్ట్రీలో ఎదుగుతారో లేదో కూడా తెలియదు. కానీ సురేఖ అప్పటికే చిరంజీవికి ఫ్యాన్. సురేఖ మనసులో కూడా చేసుకుంటే చిరంజీవిలాంటి హీరోని చేసుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటుంది.

కానీ బయటకు ఏనాడు చెప్పలేదు. ఈ సమయంలోనే అల్లు రామలింగయ్య  సురేఖ పెళ్లి చేయాలని అనుకుంటున్నారట. అప్పుడు ఒక మంచి కలెక్టర్ సంబంధం కూడా వచ్చిందట. ఇదే తరుణంలో ఆయనకు చిరంజీవి గురించి కూడా ఎవరో చెప్పడంతో, డైరెక్ట్ గా రామలింగయ్య చిరంజీవిని  వద్దకు వెళ్లి, నా కూతురుని పెళ్లి చేసుకుంటావా అని అడిగారట. కానీ చిరంజీవి ఒకేసారి షాక్ అయిపోయి  ఓకే చెప్పేసారట. కానీ రామలింగయ్య మాత్రం కాస్త సందిగ్ధంలో పడ్డారట.

ఎందుకంటే చిరంజీవి అప్పుడే ఎదుగుతున్న హీరో.  ఇంకోవైపు జీవితంలో సెట్ అయిన కలెక్టర్ సంబంధం, తన కూతురుని ఎవరికి ఇవ్వాలనే ఆలోచనలో, పడ్డ సమయంలో  ఓ మాట సురేఖను  అడిగారట. చిరంజీవిని పెళ్లి చేసుకుంటావా అమ్మ అంటే, వెంటనే సురేఖ  ఓకే చెప్పిందట. ఆ కలెక్టర్ సంబంధానికి నో చెప్పిందట.

ఇంకేముంది కూతురి ఇష్టాన్ని కాదనలేక  అల్లు రామలింగయ్య చిరంజీవికి సురేఖాను ఇచ్చి వివాహం చేశారు. ఇక అప్పటినుంచి చిరంజీవి ఒక్కో మెట్టు ఎదుగుతూ  తెలుగు సినిమా ఇండస్ట్రీకే పెద్దన్నలా మారాడు. ప్రస్తుతం ఆయన నటవారసత్వాన్ని అంది పుచ్చుకొని మెగా ఫ్యామిలీ మొత్తం ఇండస్ట్రీలో స్టార్లుగా ఎదిగారు. కానీ సురేఖ ఆ కుటుంబాన్నంత ఓ తల్లిలా గైడ్ చేస్తూ  ఎదిగేలా చేసింది. అందుకే చిరంజీవి సురేఖను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు.

newsline-whatsapp-channel
Tags : news-line collectors marraige allu-aravindh surekha allu-ramalingaiah

Related Articles