2021 లో వచ్చిన రొమాంటిక్ థ్రిల్లర్ " హసీన్ దిల్ రుబా" సూపర్ డూపర్ హిట్టు.. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రిలీజ్ అయ్యింది
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : తాప్సీ కి టాలీవుడ్ కలిసి రాలేదు కాని బాలీవుడ్ మాత్రం భలే కలిసి వచ్చింది. బాలీవుడ్ లో చేసిన సినిమాలన్నీ భలే హిట్టు కొడుతున్నాయి. 2021 లో వచ్చిన రొమాంటిక్ థ్రిల్లర్ " హసీన్ దిల్ రుబా" సూపర్ డూపర్ హిట్టు.. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రిలీజ్ అయ్యింది. కలర్ ఎల్లో ప్రొడక్షన్స్, టీ సిరీస్ ఫిలిమ్స్ నిర్మాణంలో జయప్రద్ దేశాయ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇటీవలే ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా డైరెక్ట్ గా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.
ఇక కథ విషయానికి వస్తే ...`
హసీన్ దిల్‌రుబాలో రుషి ( హీరో) తన భార్య రాణి(తాప్సీ)ని ఇబ్బందిపెట్టే తన చుట్టాల అబ్బాయి నీల్(హర్షవర్ధన్ రానే)ని చంపేసి, తన చెయ్యిని నరుక్కొని తాను చనిపోయినట్టు సృష్టిస్తాడు. అందరు హీరో చనిపోయాడనుకుంటారు. కాని ఓ పోలీస్ కి రాణిపై అనుమానం వస్తుంది.ఫస్ట్ పార్ట్ లో రుషి బతికే ఉన్నాడని అర్దమయ్యే హింట్ ఇచ్చి ఆపేశాడు ..
ఇప్పుడు ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబాలో రుషి, రాణి పేర్లు మార్చుకుంటూ ఆగ్రాలో దూరం దూరంగా బతుకుతారు.
ఎలాగైనా దేశం విడిచి వెళ్లాలని డబ్బుల కోసం కష్టపడుతూ ఉంటారు. ఫస్ట్ పార్ట్ లో రాణి మీద అనుమానపడిన పోలీస్ కు ఆగ్రా ట్రాన్స్ ఫర్ అవుతుంది. అతని ఓ రోజు రోడ్డు మీద రాణి కనిపిస్తుంది . నీల్ చుట్టాలు కూడా ఫోర్స్ చేసి ..కేసు రీ ఓపెన్ చేయిస్తారు. దేశం దాటి వెళ్లడానికి ఓ ఏజెంట్ ను పట్టుకుంటారు. కాని పోలీసులు ఆ ఏజెంట్ ని పట్టేస్తారు.
పోలీసుల్ని తప్పించుకోవడానికి రాణి ...తనను ప్రేమిస్తున్న అభిమన్యు ని పెళ్లి చేసుకుంటుంది. రుషి బతికే ఉన్నాడనే విషయం రాణి తప్పని పరిస్థితుల్లో అభిమన్యు కి చెప్తుంది. ఓ ఇద్దరు వ్యక్తులు చనిపోవడంతో రాణిని పోలీసులు అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీంతో రుషి బయటకి వస్తాడు. రుషి, రాణి, అభిమన్యు పోలీసుల నుంచి మళ్ళీ ఎలా తప్పించుకున్నారు? రుషి, రాణి ఎలా ఒక్కటయ్యారు? అభిమన్యు ఎందుకు వీళ్ళతో కలిసాడు? పోలీసులు వీళ్ళని పట్టుకున్నారా తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
తాప్సీ ని ఈ సినిమా లో చాలా కొత్తగా చూస్తాం. చాలా మెచ్యుర్డ్ యాక్టింగ్ . కథకు ఎంత కావాలో అంతే ..తన పరిమితి మేరకు స్క్రీన్ ను చాలా బాగా వాడుకుంది తాప్సీ, మ్యూజిక్ , స్టోరీ, విజువల్స్, సినిమాటోగ్రఫీ చాలా చాలా బాగుంది. సూపర్ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఉంది చూడండి.