తిరుపతి జిల్లా సత్యవేడ్ టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఒక మహిళ అధ్యక్షురాలు లైంగిక ఆరోపణలు చేస్తూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అంతేకాదు తనతో ఆదిమూలం అసభ్యకరంగా
న్యూస్ లైన్ డెస్క్: తిరుపతి జిల్లా సత్యవేడ్ టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఒక మహిళ అధ్యక్షురాలు లైంగిక ఆరోపణలు చేస్తూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అంతేకాదు తనతో ఆదిమూలం అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని చెల్లె చెల్లె అంటూ చివరికి అలాంటి పనికి ఒడిగట్టాడని ఆమె డైరెక్ట్ గా మీడియా ముఖంగా చెప్పేసింది. బాధితురాలు తన భర్తతో కలిసి హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించి లైంగిక దాడి గురించి తెలియజేసింది. అంతేకాదు ఆదిమూలంపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా లేఖ రాసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
https://x.com/TeluguScribe/status/1831607361804628397?s=19
ఎమ్మెల్యే ఆదిమూలం తనను చెల్లి చెల్లి అంటూనే లైంగిక కోరిక తీర్చాలని అన్నాడు. ఆయన తనను బలవంతం చేసినటువంటి వీడియోలు తనకు ఫోన్ చేసిన స్క్రీన్ షాట్లు అన్నింటిని ఆమె మీడియా ముఖంగా బయట పెట్టేసింది. నేను టిడిపిలో కీలకమైన నేతగా ఉన్నానని, పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో కష్టపడ్డానని బాధితురాలు తెలియజేసింది. ఆయన ఎన్నికలకు ముందే టిడిపిలోకి వచ్చారని ఆయన అభ్యర్థిగా ప్రకటించడానికి నేను మొదటి నుంచే వ్యతిరేకించానని ఆయన అవినీతిపై గతంలో అనేక పోరాటాలు చేశానని అన్నారు. అయినా సరే చంద్రబాబు ఆయనకు టికెట్ ఇచ్చారని, చివరికి చంద్రబాబు నిర్ణయాన్ని శిరసా వహిస్తూ ఆదిమూలం గెలుపు కోసం పనిచేశానని చెప్పుకొచ్చింది. ఇక ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తనపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారని, చెల్లె అని పిలుచుకుంటూ తన కోరిక తీర్చాలని వేధించాడని అన్నది.
అంతేకాదు తన అసభ్యకర మెసేజ్ లు చేస్తూ తాను చెప్పింది వినకపోతే కుటుంబాన్ని మొత్తం చంపేస్తానని బెదిరింపులకు గురి చేసాడని అన్నది. బెదిరింపులకు భయపడి నేను ఒక హోటల్ కి వెళ్లి ఆదిమూలంకు లొంగిపోయానని, ఆదిమూలం నన్ను లైంగికంగా లోపర్చుకునే దాన్ని, ఒక పెన్ కెమెరా ద్వారా రికార్డు చేశానని అది తన భర్తకు ఇవ్వడంతో ఆ వీడియో ద్వారా చంద్రబాబుకు ఫిర్యాదు చేశామని బాధితురాలు తెలియజేసింది. దీనిపై వెంటనే స్పందించినటువంటి టిడిపి అధిష్టానం ఆయనను సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది.