pasham yadagiri: ముఖ్యమంత్రి.. మూసీ నీళ్లతో ముఖం కడుక్కో..!

రేవంత్ రెడ్డికి 18 గంటలు పని చేస్తున్నారని సర్టిఫికెట్ ఇస్తున్నారు, అసలు ఆయనకు హిందీ, ఇంగ్లీష్ కూడా సరిగా మాట్లాడడం రాదని పాశం ఎద్దేవా చేశారు. చంద్రబాబు వల్ల ఎన్నో పరిశ్రమలు మూసేశారని విమర్శించారు. రాష్ట్రంలో 42 మంది రైతులు నష్టపోయారని వెల్లడించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ వాళ్లది ఒంటెద్దు పోకడ అని పాశం వ్యాఖ్యానించారు. చంద్రబాబు చుట్టాలు అందరి కన్నా ధనవంతులని తెలిపారు. 


Published Jul 22, 2024 06:37:11 AM
postImages/2024-07-22/1721645853_modi20240722T162421.864.jpg

న్యూస్ లైన్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మూసీ నీళ్లతో ముఖం కడుక్కో అంటూ సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు జోకర్, సీఎం రేవంత్ రెడ్డి ఒక బ్రోకర్ అని అన్నారు. సోమవారం తెలంగాణపైన చంద్రబాబు కుట్రలు అనే ఏం అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మీడియాతో మాట్లాడిన పాశం.. చంద్రబాబు, రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసులో A1, A2 చంద్ర బాబు, రేవంత్ రెడ్డి అని తెలిపారు. 

రేవంత్ రెడ్డికి 18 గంటలు పని చేస్తున్నారని సర్టిఫికెట్ ఇస్తున్నారు, అసలు ఆయనకు హిందీ, ఇంగ్లీష్ కూడా సరిగా మాట్లాడడం రాదని పాశం ఎద్దేవా చేశారు. చంద్రబాబు వల్ల ఎన్నో పరిశ్రమలు మూసేశారని విమర్శించారు. రాష్ట్రంలో 42 మంది రైతులు నష్టపోయారని వెల్లడించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ వాళ్లది ఒంటెద్దు పోకడ అని పాశం వ్యాఖ్యానించారు. చంద్రబాబు చుట్టాలు అందరి కన్నా ధనవంతులని తెలిపారు. 

ఫార్మా, కంపెనీ, హైటెక్ సిటీ అంటూ మోసాలు చేస్తున్నారని వెల్లడించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి అందరూ కలిసే ఉన్నారని.. వీళ్ల భారతం పట్టాలని అన్నారు. రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని.. లాఠీ లేపాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రజలంతా పోరాటం చేస్తేనే తెలంగాణను కాపాడుకోవడం సాధ్యమవుతుందని అన్నారు. అసలు మూసీ ప్రక్షాళన అనేది అవసరమా అని ప్రశ్నించారు. పోలవరం కట్టమని ఆర్డినెన్స్ తెచ్చారు. దాని గురించి ఒక్కరు కూడా నోరు మెదపడం లేదని అన్నారు. భవిష్యత్‌లో భద్రాచలం మునిగే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. 

newsline-whatsapp-channel
Tags : india-people ap-news ts-news chandrababu revanth-reddy newslinetelugu congress telanganam pashamyadagiri pressclub

Related Articles