తెలుగు సినిమా సోగ్గాడిగా పేరు తెచ్చుకున్నటువంటి నటుడు శోభన్ బాబు. తన కెరియర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ చివరికి స్టార్ హీరోగా ఎదిగారు. అప్పట్లో ఎంతో మంది హీరోయిన్లకు
న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా సోగ్గాడిగా పేరు తెచ్చుకున్నటువంటి నటుడు శోభన్ బాబు. తన కెరియర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ చివరికి స్టార్ హీరోగా ఎదిగారు. అప్పట్లో ఎంతో మంది హీరోయిన్లకు నిద్రలేకుండా చేసిన ఈ హీరో, ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి దిగ్గజ హీరోలకు కూడా చుక్కలు చూపించిన నటుడు శోభన్ బాబు. ఫ్యామిలీ స్టోరీలు చేసి బ్లాక్ బాస్టర్ హిట్స్ కొట్టిన ఘనత శోభన్ బాబుకే దక్కుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే శోభన్ బాబు అందం ఆయన రింగు హెయిర్ స్టైల్ అప్పట్లో చాలామంది ఫాలో అయ్యేవారు.
అప్పట్లో ఎవరు జుట్టు అయిన ముందుకు వస్తే శోబను బాబులా ఉంది అంటూ పొగుడుతూ ఉంటారు. శోభన్ బాబు ఈ హెయిర్ స్టైల్ ని 1975లో వచ్చినటువంటి జేబుదొంగ సినిమా నుంచి మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఇందులో శోభన్ బాబు మంజుల విజయ్ కుమార్ హీరో హీరోయిన్లుగా చేశారు. అప్పట్లో ఈ చిత్రం సూపర్ హిట్ అయి అందరికి లాభాలు తెచ్చి పెట్టింది. అంతేకాదు శోభన్ బాబు కెరియర్ లో సోగ్గాడు చిత్రం తర్వాత హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీ ఇదే.
ఇందులో గోవిందో గోవిందా అనే పాటకు ఎన్టీఆర్ చేసినట్టు డాన్స్ చేయడం అందరినీ ఆకట్టుకుంది. అయితే ఈ చిత్రం నుంచి ఆయన రింగ్ మైంటైన్ చేస్తూ వస్తున్నారట. ఆయన రింగ్ హెయిర్ స్టైల్ ప్రతిదీ కలిసి వచ్చిందని సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయని నమ్మి ఆ స్టైల్ ను జీవితకాలం మెయింటైన్ చేశారు. అలా శోభన్ బాబు ఎన్నో చిత్రాలు చేసి ఇండస్ట్రీలోనే ఒక స్టార్ గా ఎదిగారు. అంతేకాదు ఇండస్ట్రీలో అత్యధిక సంపన్న నటులలో కూడా శోభన్ బాబు ముందుండేవారు. అలా తాను చచ్చే వరకు శోభన్ బాబు అంటే హీరో అనే రేంజ్ లో ఉన్నాడు తప్ప ఎన్ని కోట్ల డబ్బులు ఇస్తానన్నా కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రం చేయలేదు.