ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ అంటే చాలామందికి దర్శక ధీరుడు రాజమౌళి గుర్తుకొస్తారు. అలాంటి ఈయన దర్శకత్వంలో సినిమా అంటే ఏ హీరో, హీరోయిన్ అయినా తప్పక ఒకే
న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ అంటే చాలామందికి దర్శక ధీరుడు రాజమౌళి గుర్తుకొస్తారు. అలాంటి ఈయన దర్శకత్వంలో సినిమా అంటే ఏ హీరో, హీరోయిన్ అయినా తప్పక ఒకే చెబుతారు. ఓకే చెప్పడం కాదు ఆయనతో ఒక్కసారైనా సినిమా చేయాలని ఎంతోమంది నటీనటులు వేచి చూస్తుంటారు. ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఒక్క ఫ్లాప్ కూడా ఎరగని దర్శకుడు రాజమౌళి అని చెప్పవచ్చు.
అలాంటి రాజమౌళి బాహుబలి సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. అలాంటి ఈ డైరెక్టర్ నుంచి సినిమా ఆఫర్ వచ్చినా రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఒకరు ఉన్నారు. ఆమె డైరెక్ట్ గా రాజమౌళి మొహం మీద చెప్పిందట. ఆమె ఎవరు ఆ వివరాలు ఏంటో చూద్దాం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది త్రిష. అలాంటి ఈమె రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన మర్యాద రామన్న సినిమాలో స్టార్ కమెడియన్ సునీల్ సరసన హీరోయిన్ గా చేయడానికి ఆఫర్ వచ్చిందట.
కానీ త్రిష డైరెక్ట్ గా మొహం మీదే చేయనని చెప్పిందట. ఆ తర్వాత కొత్త హీరోయిన్ సలోనిని రాజమౌళి ఓకే చేశారు. ఆర్కా మీడియా బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రం 2017 లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ సాధించింది. 12 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ మొత్తం 28 కోట్లపై వసూళ్లను సాధించి రికార్డు క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా మిస్ చేసుకున్న తర్వాత త్రిష చాలా బాధపడిందట.
ఈ విషయాన్ని రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. అయితే త్రిష ఈ సినిమా వదులుకోవడానికి ఒక కారణం సునీల్ అని తెలిసింది. అప్పటివరకు కామెడీ పాత్రలు చేసే సునీల్ సడన్ గా హీరోగా చేయడం, అంత చిన్న నటుడితో హీరోయిన్ గా చేయనని త్రిష చెప్పిందట. కానీ సినిమా హిట్ అయిన తర్వాత ఆమె బాధ పడిందని రాజమౌళి చెప్పారు.