తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో నితిన్ అంటే తెలియని వారు ఉండరు. హిట్స్ ప్లాపులు అనే తేడా లేకుండా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నటువంటి హీరో. అలాంటి నితిన్ కరోనా టైంలో శాలిని అనే ఆమెను
న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో నితిన్ అంటే తెలియని వారు ఉండరు. హిట్స్ ప్లాపులు అనే తేడా లేకుండా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నటువంటి హీరో. అలాంటి నితిన్ కరోనా టైంలో శాలిని అనే ఆమెను వివాహం చేసుకొని ఓ ఇంటి వాడయ్యాడు. అలాంటి ఈయన దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ప్రస్తుతం తండ్రి అయ్యాడు. ఇద్దరు దంపతులు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. అయితే ఇదే విషయాన్ని హీరో నితిన్ తన సోషల్ మీడియా ఖాతా వేదికగా బయట పెట్టాడు.
ఈ సందర్భంగా తన కుటుంబంలోకి వచ్చిన సరికొత్త స్టార్ కి స్వాగతం అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇది చూసినటువంటి నితిన్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. అయితే నితిన్ శాలినిని 2020లో పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు ముందుగా ప్రేమలో పడి ఆ తర్వాత కుటుంబాన్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
అయితే శాలిని ప్రెగ్నెంట్ అయి నేలలు నిండడంతో, షూటింగ్ లు అన్నింటికీ బ్రేక్ ఇచ్చి తన ఇంట్లోనే ఉంటూ భార్యను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ప్రస్తుతం ఈయన వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న రాబిన్ హుడ్ అనే సినిమాలో చేస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలుస్తోంది.