నారాయణపేట జిల్లా మాగనూరు మండల పరిధిలోని మందిపల్లి గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో 7 తరగతులలో 180 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే, అందరికి ఒకరే టీచర్ పాఠాలు చెప్తున్నారు. గతంలో ముగ్గురు టీచర్లు ఉండగా ఇద్దరు బదిలీపై వెళ్లిపోయారు. అయితే, వారి స్థానాల్లో ఇప్పటికీ కొత్తవారిని నియమించలేదు. దీంతో ఉన్న అన్ని తరగతుల పిల్లలకు పాఠాలు చెప్పడం కష్టతరంగా మారిందని ఆ పాఠశాలలో ఉన్న టీచర్ వాపోయారు.
న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో గురుకులాల పరిస్థితి రోజురోజుకీ ఎంత దిగజారిపోతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గురుకుల హాస్టళ్లల్లో ఉంటూ చదువుకునే విద్యార్థులు ఇటీవల ఫుడ్ పాయిజన్ కావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మరోవైపు కొన్ని హాస్టళ్లలో అయితే, ఇక గురుకులాల పరిస్థితి అలా ఉంటే ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దీన స్థితికి చేరింది. ఇప్పటికే కొన్ని పాఠశాలలను మూసేసే పరిస్థితి వచ్చిన విషయం తెలిసిందే. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు లేకపోతే, మరికొన్ని పాఠశాలల్లో టీచర్లు లేరు.