Marriage:చిరంజీవికి సురేఖని ఇవ్వడానికి అసలు కారణం ఇదేనట.!

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీని శాసిస్తున్న ఫ్యామిలీలలో మెగా ఫ్యామిలీ మొదటి స్థానంలో ఉంటుంది. ఈ ఫ్యామిలీ అంతటి స్థాయికి చేరుకోవడానికి ప్రధాన కారకుడు చిరంజీవి. ఆయన ఎంతో


Published Aug 29, 2024 04:17:19 PM
postImages/2024-08-29/1724928439_SUREKHA.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీని శాసిస్తున్న ఫ్యామిలీలలో మెగా ఫ్యామిలీ మొదటి స్థానంలో ఉంటుంది. ఈ ఫ్యామిలీ అంతటి స్థాయికి చేరుకోవడానికి ప్రధాన కారకుడు చిరంజీవి. ఆయన ఎంతో కష్టపడి ఒక్కో మెట్టెక్కుతూ మెగాస్టార్ గా మారాడు. అలాంటి చిరంజీవి సినిమాల విషయం పక్కన పెడితే తన సొంత లైఫ్ లో సురేఖని పెళ్లి చేసుకోవడం వెనుక ఒక పెద్ద కథ ఉందట. అయితే అల్లు అరవింద్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు  చిరంజీవి సురేఖల పెళ్లికి సంబంధించిన విషయాన్ని ఆయన క్లియర్ గా చెప్పారు. అయితే ఈయన ఆలీతో సరదాగా టాక్ షోలో పాల్గొన్నారు.

సందర్భంగా ఆలీ చిరంజీవిని అల్లుడిగా చేసుకోవాలని ఆలోచన ఎవరిది అని అడగ్గా దానికి క్లారిటీగా సమాధానం ఇచ్చారు. చిరంజీవిని మా ఇంటి వాడిని చేసుకోవడానికి  కారణం మా అమ్మ. ఓ రోజు అమ్మ మా ఇంట్లో హాల్లో కూర్చుని ఉండగా కాలింగ్ బెల్ మోగింది. వెంటనే వెళ్లి తలుపు తీసి,  చూసేసరికి ఒక అతను నిలబడి ఉన్నాడు. ఏవండీ సత్యనారాయణ గారు ఇక్కడ ఉన్నారా అని అడిగాడు. ఇంటి పైన గదిలో ఉన్నాడు వెళ్లండి అని అమ్మ చెప్పింది. అంతేకాదు ఎలా వెళ్లాలో దారి కూడా చూపించింది. అలా సత్యనారాయణతో కాసేపు మాట్లాడిన చిరంజీవి కిందికి వచ్చి వెళ్ళొస్తానమ్మ అంటూ చెప్పుకుంటూ వెళ్ళాడట.

 చిరంజీవి వెళ్లిన తర్వాత సత్యనారాయణ మా అమ్మ కిందికి పిలిచి మీ దగ్గరికి వచ్చిన అబ్బాయి ఎవరు  అని అడిగిందట. మనవాళ్లే అత్తమ్మ అంటూ సత్యనారాయణ చెప్పుకొచ్చారట. ఆరోజు రాత్రి మా నాన్న అల్లు రామలింగయ్య వచ్చాక  ఇందాక మన ఇంటికి చిరంజీవి వచ్చి వెళ్లారు ఆయన సినిమాల్లో వేషాలు బాగానే వేస్తున్నాడు కదా మన అమ్మాయికి ఆలోచించకూడదని  అల్లు రామలింగయ్యతో అన్నదట. దీంతో రామలింగయ్య ఊరుకో మళ్ళీ సినిమా వాళ్లకు ఇచ్చి ఏంటి అంటూ టాపిక్ కట్ చేశారట.  

ఆ తర్వాత కొన్నాళ్లకు  "మన ఊరి పాండవులు" సినిమా షూటింగ్ కోసం చిరంజీవితో అల్లు రామలింగయ్య పని చేయవలసి వచ్చింది. మా నాన్నకు ఆయనను దగ్గర నుంచి పరిశీలించే ఛాన్స్ వచ్చింది. షూటింగ్ 20 రోజులు రాజమండ్రిలో జరుగుతున్న సమయంలో నాన్న సీఐడీ లాగా ఆయనను దగ్గరుండి అన్ని రకాలుగా గమనించారు. మందు తాగుతాడా, సిగరెట్ తాగుతాడా, ఈ వ్యక్తి ఎలాంటివాడు అన్ని తెలుసుకున్నాడు.

చిరంజీవికి అవేవీ లేకపోవడంతో  రామలింగయ్య ఆనందపడ్డాడట. షూటింగ్ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత  మా అమ్మతో చిరంజీవి చాలా బుద్ధిమంతుడు చాలా మంచోడు మన అమ్మాయికి సెట్ అవుతాడని అన్నారట. చివరికి చిరంజీవికి సురేఖాను ఇచ్చి పెళ్లి చేశారట. ఈ విధంగా మా అమ్మ చిరంజీవిని మొదటిసారి చూసే ఓకే చేయడంతో మా బంధుత్వం కలిసిందని  అల్లు అరవింద్  ఆలీతో చెప్పారు ప్రస్తుత ఆయన మాటలు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయి.

newsline-whatsapp-channel
Tags : chiranjeevi marraige, newslinetelugu allu-aravindh ramcharan surekha allu-ramalingaiah

Related Articles