మూడు నెలల తర్వాత మళ్లీ మంచిరోజులు వచ్చాయి. శుక్ర మూఢమి, గురు మూ ఢమి రావడంతో వివాహాది శుభకార్యాలకు అవాంతరం ఏర్పడిన విషయం తెలిసిందే.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: శుభకార్యాలు చెయ్యాలనుకునేవారికి గుడ్ న్యూసే..ఏప్రిల్ నుంచి మూఢం మొదలయ్యింది. దాదాపు మూడు నెలల తర్వాత మళ్లీ మంచిరోజులు వచ్చాయి. శుక్ర మూఢమి, గురు మూ ఢమి రావడంతో వివాహాది శుభకార్యాలకు అవాంతరం ఏర్పడిన విషయం తెలిసిందే.
శ్రావణ మాసం ప్రారంభంమై సెప్టెంబర్ 3 తో ముగియనుంది. శుభకార్యాలు , మంచిపనులు చెయ్యాలనుకునే వారికి అనుకూలమైన మాసం . గృహ ప్రవేశాలు, పెళ్లిళ్లు చేసుకునేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ముఖ్యంగా ఆ రెండు రోజులు మరీ స్పెషల్ డే అంటున్నారు పురోహితులు.
ఆగస్టు నెలలో వరుసగా ముహూర్తాలు ఉన్నాయని అంటున్నారు పురోహితులు. ఈ నె ల 7, 8, 9, 10, 11, 15, 17, 18, 22, 23, 24, 28 శుభ ముహూర్తాలు ఉన్నాయని అంటున్నారు. త్వరలో పెళ్లి చేసుకోవాలి అనుకునేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్. ఈ నెల 17, 18 తేదీలో అద్భుతమైన శుభ ముహూర్తం ఉందని పురోహితులు పేర్కొన్నారు. మామూలు నెలల కంటే శ్రావణమాసం పెళ్లిళ్లు , గృహప్రవశాలు ఎక్కువ జరుగుతుంటాయి.
మూడు నెలలుగా కళ్యాణ మండపాలు, బాజా భజంత్రీలు, ఫోటో, వీడియో గ్రాఫర్లు, బ్యూటీ పార్లర్లు, ఈవెంట్ల నిర్వహకులు, ప్రింట్ ప్రెస్, జ్యులరీ, వస్త్ర దుకాణాలు, పండ్లు, పూల, క్యాటరింగ్ వాళ్లు సంతోషంలో ఉన్నారు. మూడు నెలల వరకు ఖాళీగా ఉన్న వీరంతా త్వరలో బిజీ కానున్నారు.