తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేకమైన డాన్స్ మాస్టర్ గా గుర్తింపు పొందారు శేఖర్ మాస్టర్. ఢీ అనే ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఈయన టాలీవుడ్ లోని టాప్ డాన్స్ మాస్టర్ లలో ఒకరిగా నిలిచారు.
న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేకమైన డాన్స్ మాస్టర్ గా గుర్తింపు పొందారు శేఖర్ మాస్టర్. ఢీ అనే ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఈయన టాలీవుడ్ లోని టాప్ డాన్స్ మాస్టర్ లలో ఒకరిగా నిలిచారు. కేవలం డాన్స్ మాస్టర్ గానే రియాలిటీ డాన్స్ షోలకు ఇతర షోలకు జడ్జ్ గా కూడా పనిచేస్తున్నారు.
అలాంటి శేఖర్ మాస్టర్ ఇంట్లో ప్రస్తుతం విషాదం నెలకొన్నట్టు తెలుస్తోంది. విషయాన్ని శేఖర్ మాస్టర్ తన ఇంస్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా బయటపెట్టారు. ఆయన ఆ పోస్ట్ పెట్టగానే ప్రముఖ యాంకర్ అనసూయ కూడా సంతాపాన్ని తెలియజేసింది.
https://www.instagram.com/p/C-FwDifvvmm/?utm_source=ig_web_copy_link
అయితే శేఖర్ మాస్టారు తమ్ముడు మరణించాడని తెలుస్తోంది. ఈ సందర్భంగా శేఖర్ మాస్టర్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ' నిన్ను మిస్ అవుతున్నాను సుధా.. ఇక్కడకు వెళ్లిన ఏం చేసినా నువ్వే గుర్తుకు వస్తున్నావు. నువ్వు చనిపోయావని చేదు నిజాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఎక్కడో ఒక చోట నువ్వు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను.
నువ్వు ఎక్కడ ఉన్న ఎప్పుడు మాతోనే ఉంటావు మిస్ యు రా తమ్ముడు' అంటూ పోస్ట్ పెట్టి ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. చాలామంది సంతాపం తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు. అలాంటి శేఖర్ మాస్టర్ ప్రస్తుతం ఇండస్ట్రీలోనే టాప్ మోస్ట్ డాన్స్ మాస్టర్ గా కొనసాగుతున్నారు.