త్రిష సినిమా ఇండస్ట్రీని 20 సంవత్సరాల నుంచి ఏకధాటిగా ఏలుతున్న హీరోయిన్. అలాంటి ఈమె తెలుగు, తమిళ్, మలయాళ ఇలా సౌత్ ఇండస్ట్రీని మొత్తం ఊపు ఊపుతోంది. ఇండస్ట్రీలో ఉండే స్టార్
న్యూస్ లైన్ డెస్క్: త్రిష సినిమా ఇండస్ట్రీని 20 సంవత్సరాల నుంచి ఏకధాటిగా ఏలుతున్న హీరోయిన్. అలాంటి ఈమె తెలుగు, తమిళ్, మలయాళ ఇలా సౌత్ ఇండస్ట్రీని మొత్తం ఊపు ఊపుతోంది. ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలందరితో ఈమె నటించింది. అలాంటి త్రిషకు ఇంతటి లైఫ్ ఇచ్చింది మాత్రం తెలుగు ఇండస్ట్రీ అని చెప్పవచ్చు. ఈమె తెలుగులో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, వంటి స్టార్లు అందరితో నటించింది. అలాంటి టాలీవుడ్ ను కొన్నేళ్లపాటు ఊపు ఊపింది.
తాజాగా కొన్ని సంవత్సరాల నుంచి కొత్త హీరోయిన్స్ తెలుగు ఇండస్ట్రీకి రావడంతో ఈమె రూటు మార్చి తమిళ్, మలయాళ ఇండస్ట్రీలోకి షిఫ్ట్ అయిపోయింది. అక్కడ కూడా వరుస సినిమాలతో దూసుకుపోతోంది. అలాంటి ఈ ముద్దుగుమ్మకు కొన్నాళ్ళ పాటు ఆఫర్లు రాలేదు కానీ మళ్ళీ పొన్నియన్ సెల్వన్ అనే మూవీ ద్వారా మళ్లీ కం బ్యాక్ ఇచ్చింది. ఆ తర్వాత విజయ్, లోకేష్ కనకరాజు కాంబినేషన్ లో వచ్చినటువంటి లియో చిత్రంలో నటించింది. అంతేకాకుండా ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం చిరంజీవి సరసన "విశ్వంభర" చిత్రంలో నటిస్తుందట.
అయితే ఈ ముదురు బ్యూటీ గురించి తాజాగా ఒక ప్రొడ్యూసర్ సంచలనమైన ఆరోపణలు చేశారు. ఇంతకీ ఆయన ఎవరయ్యా అంటే గిరిధర్. అయితే గిరిధర్ ఒక హర్రర్ కథాంశంతో త్రిష దగ్గరికి వెళ్లారట. ఆమె కథ నచ్చడంతో రెమ్యూనరేషన్ అన్ని మాట్లాడుకొని షూటింగ్ కూడా కొంత భాగం తీశారట. కొన్నాళ్లు గడిచాక ఎవరో చెప్పిన మాటలు విని షూటింగ్ మధ్యలో నాకు ఎక్కువ రెమ్యునరేషన్ కావాలని గిరిధర్ రావును ఇబ్బంది పెట్టిందట. చివరికి గిరిధర్ రావును మరో కోటి రూపాయల డబ్బులు కావాలని డిమాండ్ చేసిందట, కానీ ఆయన నేను ఇచ్చుకోలేను అంత డబ్బు లేదు కావాలంటే తమిళ షాట్ లైట్ హక్కులు ఇస్తానని చెప్పాడట.
అయినా త్రిష వినకుండా తనకు కావలసిన డబ్బులు అన్ని తీసుకుందట. చివరికి ఈ సినిమా దారుణంగా డిజాస్టర్ అయింది. ఆ ప్రొడ్యూసర్ జీవితమే తలకిందులు అయిపోయిందట. ఆయన ఇప్పటికి కూడా కోలుకోవడం లేదని చెబుతూ త్రిష వల్ల నేను సంకనాకి పోయాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ రూమర్లపై త్రిష ఇప్పటివరకు స్పందించలేదు.