న్యూస్ లైన్ డెస్క్ : జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీకి ఉప్పల్ లో చేదు అనుభవం ఎదురైంది. ఉప్పల్ నల్ల చెరువు పరిశీలించడానికి వెళ్లిన ఆమెను స్థానికులు ప్రశ్నించారు. ఉప్పల్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు ఏం జరగడం లేదని నిలదీశారు.
గణేష్ ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి సభ్యులు మేయర్ ను ప్రశ్నించారు. ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈ ఘటనలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మేయర్ వర్గీయులు తమపై దాడి చేశారని భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి సభ్యులు ఉప్పల్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. ప్రశ్నించినందుకు దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.