ఆగష్టు 16వ తేదిన వరలక్ష్మి వ్రతం సంధర్భంగా భక్తులకు ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ఆగష్టు 16వ తేదిన వరలక్ష్మి వ్రతం సంధర్భంగా భక్తులకు ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం భక్తుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. రెండో శుక్రవారం కావడంతో కనకదుర్గమ్మ అమ్మవారిని వరలక్ష్మీదేవిగా అలంకరిస్తారు.
ఈ నెల 17వ తేది నుంచి 20వ తేది వరకు పవిత్రోత్సవాలు కూడా నిర్వహించనున్నారు. ఆగస్టు 23 వ తేదిన సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించాలని ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 23వ తేదిన సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించనున్నారు. ఇక, ఆ రోజు ఉదయం ఏడుగంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఆర్జిత సేవ టికెట్ రూ.1500తో కొన్న వారికి వ్రతం నిర్వహిస్తారు.అయితే మొదట అప్లై చేసుకున్న 500 మందికి మాత్రమే ఈ ఫ్రీ వరలక్ష్మీ వ్రతం అమ్మవారి గుడిలో చేసుకునే అవకాశం దక్కుతుంది.
అనుమతిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా వచ్చే భక్తులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితోపాటు దుర్గమ్మ కొండపై ఆగస్టు17 నుంచి 20 వరకు పవిత్రోత్సవాలు కూడా జరగనున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారికి ఈ నెల 17న సాయంత్రం నాలుగు గంటలకు ఉదక శాంతి, 18వ తేదిన ఉదయం మూడు గంటలకు సుప్రభాత సేవ, స్నపనాభిషేకం వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఆగస్టు 19వ తేదిన మండపారాధన, మూలమంత్ర హవనాలు, వేదపారాయణలు, హారతి, మంత్రపుష్పం వంటి కార్యక్రమాలు ఉంటాయి. అలాగే ఈ నెల 20వ తేదిన ఉదయం 10.30 గంటలకు పూర్ణాహుతి, కలశోద్వాసనతో పవిత్రోత్సవాలు ముగించనున్నారు.