vena vani: టీవీ ఛానళ్లను గట్టిగా వేస్కున్న వేణుస్వామి వైఫ్.. ఇచ్చి పడేసిందిగా!

వేణుస్వామి భార్య కు బాగా కోపం వచ్చింది. పాపం భర్తను టార్గెట్ చేస్తున్నందుకు మీడియా ఛానల్స్ ను ఏకిపారేసింది.


Published Aug 13, 2024 03:18:00 PM
postImages/2024-08-13/1723542562_veena.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : వేణుస్వామి భార్య కు బాగా కోపం వచ్చింది. పాపం భర్తను టార్గెట్ చేస్తున్నందుకు మీడియా ఛానల్స్ ను ఏకిపారేసింది. వేణుస్వామి మీద జర్నలిస్టుల సంఘం కంప్లెయింట్ రెయిజ్ చేశారు. ఈ ఘటన వేణుస్వామి భార్యకు బాగా డిస్టర్బ్ చేసినట్టుంది. ఎందుకు మీకు ఈ బాధ...ఈ జాతకాలు చెబుతున్న వ్యక్తి కోసం మీకెందుకు సామి..గంటలు గంటలు ఎందుకు వీణ వాయిస్తున్నారు. వేరే టాపిక్స్ మీద ఫోకస్ చెయ్యొచ్చు కదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.


మీరేం జర్నలిస్టులు..మేం జర్నలిస్టుల మంటే ...మా టైంలో జర్నలిజం విలువలు ఇలా ఉండేవి ..అంటూ తన మీడియా రోజులు గుర్తు చేసుకుంది వీణా వాణి. అసలు సో కాల్డ్ ఛానల్స్ కు ఎందుకు ఇంత ఆత్రం ...నా భర్త జాతకాలు చెప్పాడే అనుకుందాం..అది ప్రజా సమస్యల కంటే పెద్ద టాపిక్ కాదే...మీరెందుకు ఇంత సీన్ చేస్తున్నారంటుంది. అంతేనా అసలు టార్గెట్ అంత నా భర్త గురించి మీకెందుకు.. సోషల్ మీడియాలో చిన్నవీడియో రిలీజ్ చేసింది మేడం. అంతా ..మీడియా దిగ జారిపోతుందని బాధపడుతూనే...నా భర్త మీద ఎందుకు కంప్లెయింట్ ఇచ్చారంటూ సీరియస్ గా వార్నింగే ఇచ్చారు.

మాట కు ముందొకసారి ...తర్వాత ఓ సారి జర్నలిస్టులకు నా భర్త సంగతి ఎందుకు...మీ మీద ఎందుకు కేసులు పెట్టకూడదు...సెలబ్రెటీస్ కు పర్సనల్ లైఫ్ ఇవ్వడం లేదు...అంటూ జర్నలిస్టులను అందరిని ఓ చుట్ట చుట్టి పారేసింది. మీడియా విలువలు నేర్చుకొండి ఫస్ట్ తర్వాత చించేద్దురు. జనం మీద ఫోకస్ చెయ్యండి సార్ ...ప్రజాసమస్యలు బోలెడు ఉన్నాయంటూ చెప్పుకొచ్చింది. ఇంకా చాలా నే చెప్పారు..మీరు కూడా వీడియో చూసేయండి.

 

newsline-whatsapp-channel
Tags : journalist venuswamy social-media veena-srivani

Related Articles