BRS: వరంగల్ కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ల నిరసన 2024-06-20 14:48:38

న్యూస్ లైన్ డెస్క్: వరంగల్ కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ల నిరసన తెలిపారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ వరంగల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ కౌన్సిల్ సమావేశానికి హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను, కార్పొరేటర్లను పోలీసులు తనిఖీ చేసి పంపడంపై అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మేయర్ గుండు సుధారాణి సభ్యత్వం రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. తెలంగాణ రాజముద్ర నుంచి కాకతీయ తోరణం, చార్మినార్‌ను తొలగించవద్దంటూ, ఓరుగల్లు ఖ్యాతిని కాపాడాలని ప్లకార్డులు పట్టుకుని బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు.