Niranjan Reddy: రుణమాఫీపై ప్రభుత్వం అబద్ధాలు ఆడుతుంది

మొదట రుణమాఫీకి 40 వేల కోట్లు కావాలని చెప్పి.. తర్వాత క్యాబినెట్ మీటింగ్ అనంతరం రుణమాఫీకి 30 వేల కోట్లే అని అంటున్నాడాని అన్నారు.


Published Jun 25, 2024 04:22:27 AM
postImages/2024-06-25/1719306910_brsniranjan.PNG

 

న్యూస్ లైన్ డెస్క్: రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు ఆడుతుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ అధికారంలో రాగానే డిసెంబర్ 9న చేస్తామని అన్నాడాని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆగస్టు 15న చేస్తామన్నాని చెబుతున్నాడాని మండిపడ్డారు. మొదట రుణమాఫీకి 40 వేల కోట్లు కావాలని చెప్పి.. తర్వాత క్యాబినెట్ మీటింగ్ అనంతరం రుణమాఫీకి 30 వేల కోట్లే అని అంటున్నాడాని అన్నారు. రుణమాఫీకి సంబంధించి రూ.19 వేల కోట్లకు రూ.14 వేల కోట్లు ఇచ్చామన్నారు. ఎన్నికల నాటికి మిగిలిపోయిన రైతాంగానికి రుణమాఫీ చేస్తారా? చేయరా? అని ప్రశ్నించారు. రూ. 2 లక్షల రుణం కావాలంటే రైతుకు ఖచ్చితంగా 5 ఎకరాల నుండి 10 ఎకరాలు ఉండాలని, కోటి 33 లక్షల ఎకరాలు 5 ఎకరాల లోపు రైతుల చేతిలో ఉందన్నారు. గ్రామాలు, మండలాల వారీగా రైతులు తీసుకున్న రుణాల వివరాలు ప్రకటించాలని, రాష్ట్రంలో 5 ఎకరాల లోపు రైతులు ఎవరికీ రూ. 2 లక్షల రుణాలు లేవున్నారు. ఈ విషయం బ్యాంకు అధికారులే చెబుతున్నారన్నారు. రైతు కూలీలకు రూ. 12 వేలు ఇస్తారా? కౌలు రైతులు ఎంత మంది ఉన్నారు? వారికి రూ. 15 వేలు ఇస్తారా అని నిలదీశారు. రుణమాఫీపై క్యాబినెట్ నిర్ణయం మీద గ్రామాల్లో పాలాభిషేకాలు, సంబరాలు చేయడం సిగ్గుచేటు అన్నారు. రుణమాఫీ వ్యవహారం సినిమా లెక్క ఉందని, ఆడియో రిలీజ్, ఫస్ట్ పిక్, ప్రీమియర్ షో, రిలీజ్ షో లెక్క చేస్తున్నారని విమర్శించారు.
 

బీఆర్‌ఎస్ నోరు కట్టుకుంటే రుణమాఫీ ఒక లెక్కనా అని అపహాస్యం చేశారు. ఇప్పుడు రుణమాఫీ చేయకుండానే సంబరాలు చేయడం దారుణం అన్నారు. బాధ్యత వహించే, ఘనత వహించే మీడియా ఏం చేస్తుందని ఇదే కేసీఆర్ హయాంలో జరిగి ఉంటే ఆ మీడియా ఊరుకునేదా అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు పది పూర్తైతే రూ. 10 వేలు, ఇంటర్ పూర్తయితే రూ. 15 వేలు, డిగ్రీ పూర్తయితే రూ. 25 వేలు, పీజీ పూర్తయితే రూ. లక్ష, ఎంఫిల్, పీహెచ్‌డీ పూర్తిచేస్తే రూ. 5 లక్షలు అన్నారు. ఇప్పటి వరకు ఒక్కరికైనా ఇచ్చారా అని నిలదీశారు. ఎదుగుతున్న యువతరాన్ని గొప్పగా వంచించిన పార్టీ కాంగ్రెస్ అని, పార్టీ 50 ఏళ్ల క్రితం జూన్ 25న ఈ రోజు ఎమర్జన్సీ విధించిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. రాజ్యాంగాన్ని కాలరాసిన పార్టీ కాంగ్రెస్ దళితబంధు వంటి మంచి పథకాన్ని కాంగ్రెస్, బీజేపీలు అపహాస్యం చేశాయి అన్నారు. అంబేద్కర్ పేరు మీద కాంగ్రెస్ రూ. 12 లక్షలు ఇస్తాం అన్నారు. కానీ ఏడు నెలలలో ఏ ఒక్కరికైనా ఇచ్చారా అన్నారు. రాష్ట్రంలోని మేధావులు ఈ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ మోడీ దెబ్బకు చతికిలబడిందన్నారు. చివరలో రాహుల్ పాదయాత్రతో కొంచెం లేచి నిలబడిందని, దేశ జనాభా రెండుగా చీలిన కీలక సమయంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతారాహిత్యం వహించిందన్నారు. బీజేపీ గెలుపుకు బీఅర్ఎస్ సహకరించిందని కాంగ్రెస్ పార్టీ చెప్పడానికి సిగ్గుండాలని ఎద్దేవా చేశారు. రేవంత్ సొంతూరు కొండారెడ్డి పల్లిలో బీజేపీకి లీడ్ వచ్చిందని, తెలంగాణలో బీజేపీకి అధిక స్థానాలు రావడంపై ఏఐసీసీ కమిటీలు వేసిందని తెలిపారు. బీజేపీని నిలువరించడంలో విఫలమైందని కాంగ్రెస్ పార్టీ అంగీకరించిందన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ఖచ్చితంగా పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

newsline-whatsapp-channel
Tags : telangana ts-news

Related Articles