Jagadish reddy: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పిటిషన్

కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ లపై అనర్హత వేటు వేయాలని కోరుతూ పిటిషన్ ఇచ్చేందుకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి స్పీకర్ ప్రసాద్ కుమార్ అపాయింట్మెంట్ కోరారు.


Published Jun 25, 2024 05:34:52 PM
postImages/2024-06-25/1719317092_spjr.jpg

న్యూస్ లైన్ డెస్క్:  కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ లపై అనర్హత వేటు వేయాలని కోరుతూ పిటిషన్ ఇచ్చేందుకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి స్పీకర్ ప్రసాద్ కుమార్ అపాయింట్మెంట్ కోరారు. కాగా, ఈ విషయంపై స్పీకర్ ఆలోచించి చెబుతానన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ మారిన ఎమ్మెల్యేలను పక్కన పెట్టుకుని ఫిరాయింపుల అంశాన్ని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిందని మండిపడ్డారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజలకు సాగు, త్రాగునీరు, కరెంటు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రైతు రుణమాఫీపై కేబినేట్‌లో రుణమాఫీ అర్హులు ఎవరో చెప్పాలేదన్నారు. 2 లక్షల రుణాలు మాఫీ చేయడానికి మొదట 40 వేల కోట్లు చెప్పి.. ఇప్పుడు రుణమాఫీకి 30 వేల కోట్లు అంటున్నారని విమర్శించారు. స్పీరక్ వెంటనే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు.  

newsline-whatsapp-channel
Tags : telangana mla brs congress

Related Articles