KTR: జీవో 46 బాధితుల కోసం పోరాటం చేస్తాం 2024-06-20 17:30:08

న్యూస్ లైన్ డెస్క్: తాము అధికారంలో ఉన్నప్పుడు జీవో 46 సవరిద్దామన్న ప్రయత్నం ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇప్పుడు నిరుద్యోగులకు న్యాయం దక్కేవరకు బీఆర్ఎస్ పార్టీ తరపున పోరాడుతామని జీవో 46 బాధితులకు భరోసా ఇచ్చారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ మీడియా సమావేశం నిర్వహించారు. కాగా, అక్కడికి జీవో 46 బాధితులు వచ్చి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ప్రభుత్వం నిరుద్యోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని వాపోయారు. జోవో 46తో చాలా నష్టపోతున్నామని తెలిపారు. వెంటనే తమకు న్యాయం జరిగేలా చూడాలని కేటీఆర్‌కు వినతి పత్రం అందజేశారు.