Mallu Ravi: సీఎం తిండి కూడా తినట్లేదు 2024-06-19 15:46:35

న్యూస్ లైన్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిలో పడి తిండి కూడా తినట్లేదని నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రోజుకు 20 గంటలు పని చేస్తున్నారన్నారు. పనిలో పడి రోజు ఉదయం టిఫిన్ చేయట్లేదని, మధ్యాహ్న చేయాల్సిన భోజనం కూడా సాయంత్రం 5 గంటలకు చేస్తున్నారని తెలిపారు. కాగా, ఎంపీ వ్యాఖ్యలపై పలువురు విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం పట్టించుకోవడం లేదని వాపోయారు. నీళ్లు, కరెంటు కోతలతో ప్రజలు ధర్నాకు దిగి పెద్ద ఎత్తున్న ఆదోళన చేస్తున్న సీఎం మాత్రం వారి సమస్యలపై ఒక రివ్యూ కూడా నిర్వహించడంలేదని దుమ్మెత్తి పోస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు ఇలా మీడియా ముందుకు వచ్చి గొప్పలు చెప్పుకోవడం మంచిది కాదని తెలిపారు.