Congress: జీవన్ రెడ్డితో ముగిసిన భట్టి చర్చ

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు చేరుకుని జీవన్ రెడ్డిని బుజ్జగించారు. ఆయనతో భట్టి విక్రమార్క, శ్రీధర్ బాడు చర్చలు జరిపారు.


Published Jun 25, 2024 03:41:25 PM
postImages/2024-06-25/1719310285_jeevanreddy.PNG

న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ తీరుపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వంపై అసహనంతో ఉన్న జీవన్‌ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రేపు అసెంబ్లీ దగ్గర అన్ని మాట్లాడుతామని జీవన్ రెడ్డి కౌన్సిల్ చైర్మన్ అపాయింట్మెంట్ కోరారు. కాగా, ఈ నేపథ్యంలో బేగంపేటలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు చేరుకుని జీవన్ రెడ్డిని బుజ్జగించారు. ఆయనతో భట్టి విక్రమార్క, శ్రీధర్ బాడు చర్చలు జరిపారు. అనంతరం భట్టి మీడియాతో మాట్లాడారు. జీవన్ రెడ్డి  పార్టీలో సీనియర్ నాయకులు అని వారు అందరికి మార్గదర్శకం అన్నారు. జీవన్ రెడ్డి అనుభవాన్ని ప్రభుత్వం నడపడం కోసం తప్పనిసరిగా వినియోగిస్తామని, కాంగ్రెస్ అధికారంలో లేని పది సంవత్సరాలు కాంగ్రెస్ జెండాను భుజాన మోశారన్నారు. పార్టీ భావజాలాన్ని చట్టసభల్లో జీవన్ రెడ్డి వినిపించారని తెలిపారు. ఈ ప్రభుత్వం నడవడం కోసం వారి ఆలోచనలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకుంటామని భట్టి పేర్కొన్నారు. 
 

newsline-whatsapp-channel
Tags : telangana ts-news congress

Related Articles