Bhatti: రాష్ట్ర అభివృద్ధి కోసమే కలిశాం.?

Published 2024-07-04 16:30:08

postImages/2024-07-04/1720090808_bhatti1.jfif

న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్ర అభివృద్ధి, విభజన చట్టంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాను కలిశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భట్టి ప్రధానిని కలిసేందుకు ఢిల్లీకి వెళ్లారు. ఈ భేటీ అనంతరం భట్టి మీడియాతో మాట్లాడుతూ వేలం లేకుండా సింగరేణికి బొగ్గు పనులు కేటాయించాలని ప్రధానితో కోరామని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఐఐఎం ఏర్పాటు చేయాలని, ఐటిఐఆర్ ప్రాజెక్టును తిరిగి పునరుద్ధరించి కేటాయింపులు చేయాలని కోరారు. సెమీ కండక్టర్స్ యూనిట్ తెలంగాణలో ఏర్పాటు, ప్రతి జిల్లాకు నవోదయ స్కూల్, కస్తూర్బా పాఠశాలలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. విద్యుత్తు రంగంలో తెలంగాణకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని, ఎక్స్చేంజి కింద డిఫెన్స్ ల్యాండ్, రీజినల్ రింగ్ రోడ్డుకు మొత్తంగా ఒకే జాతీయ రహదారి నెంబర్ ఇవ్వాలని తెలిపారు. రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని, డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంలో తెలంగాణ మార్చేందుకు కేంద్రం సహకారం ఇవ్వాలని కోరామన్నారు. ఐపీఎస్ క్యాడర్ కింద 29 మందిని అదనంగా ఇవ్వాలని కోరడం జరిగిందని భట్టి పేర్కొన్నారు.