MJR: పర్దా రాజకీయాలను బంధు పెట్టు రేవంత్

Published 2024-07-03 18:48:24

postImages/2024-07-03/1720012704_mjr.jfif

న్యూస్ లైన్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్దా రాజకీయాలను బంద్ పెట్టి పాలనపై దృష్టి పెట్టాలని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సూచించారు. ఎమ్‌జేఆర్ చారిటబుల్ ట్రస్ట్, మర్రి రిటైల్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్మించిన పాఠశాలలపై ట్రస్ట్, కంపెనీ పేర్లు తొలగించడం చాలా దారుణం అన్నారు. ఈ విషయాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజలు అధికారాన్ని ఇచ్చింది ప్రజలకు మంచి చేయాలని మాత్రమే కానీ ట్రస్ట్ ద్వారా చేపట్టిన కార్యక్రమాలపై పేరు తొలగించాలని అధికారం ఇవ్వలేదని తెలిపారు. వీరు గెలిచినా ఈ 6 నెలలలో తన హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు రిబ్బేన్ కట్టింగ్ లు, ప్రారంభాలు మాత్రమే చేశారన్నారు. ఈరోజు వరకు స్వంతంగా రేవంత్ చేసింది ఏది లేదని, కేవలం గోడల పైన తన ట్రస్ట్ పేర్లు మాత్రమే తొలగించగలరు కానీ, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ‘మర్రి’ పేరును మాత్రం తొలగించలేరని అన్నారు. రాజకీయ చరిత్రలో రేవంత్ కేవలం పేరు కోసమే పాటుపడ్డారని, కానీ తను ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడ్డనాని గుర్తు చేశారు. ఈ ప్రాంత వాసుల చిరకాల కోరికలు నెరవేర్చను, ఈ ప్రాంత విద్యార్థుల భవిష్యత్తు కోసం శాశ్వత నిర్మాణాలు నిర్మించాను, ఈ ప్రాంత వాసుల కోసం వైద్య సేవలను మెరుగుపరచాను, వ్యవసాయం విద్య వైద్యనికి ప్రాధాన్యత ఇస్తూ ఎన్నో నిర్మాణాత్మక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. తను 10 ఏళ్లుగా జిల్లా సాధించడం, మెడికల్ కళాశాల తేవడం, రైతులకు సాగు నీటి ప్రాజెక్టు లు తేవడంపై, నాగర్ కర్నూల్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని దృష్టి పెట్టాన్నారు. ఎవరైనా తమ సంస్థ లేదా వారు స్వంతంగా  ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే బాజాప్త ఆ కార్యక్రమాలపై తమ పేరు, తమ సంస్థ పేరు రాసుకోవచ్చని ప్రభుత్వం ఆదేశాలు ఉన్నాయి. అందులో భాగంగానే మా ట్రస్టు ద్వారా మరియు మా కంపెనీ ద్వారా నిర్మించిన పాఠశాలలపై మా కంపెనీ పేరు ట్రస్ట్ పేరు రాసుకోవడం జరిగింది. ఈరోజు ప్రభుత్వంలో భాగ్యస్వామిగా ఉన్న నువ్వు ప్రభుత్వం విడుదల చేసిన జీవోనే గౌరవించకుంటే ఎలా అని ప్రశ్నించారు.


గత ఎన్నికల్లో ప్రజలకు 420 అబద్ధపు హామీలు ఇచ్చి గద్దె ఎక్కినావు వంద రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తానని ప్రజలకు బాండ్ పేపర్ రాసి ఇచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఉచిత బస్సు తప్ప ఏ గ్యారంటీ నెరవేర్చలేదని విమర్శించారు. డిసెంబర్ 9వరకు రైతు రుణమాఫీ చేస్తా అన్ని చెప్పి ఈరోజు వరకు చేయలేదన్నారు. రైతులకు రైతు భరోసా లేదు, మూసలవ్వలకు, తాతలకు 4000 పెన్షన్ లేదు, పుట్టిన పిల్లల నుండి చనిపోయే ముసలవ్వల వరకు రేవంత్ రెడ్డి మోసం చేశారని ఆరోపించారు. నియోజకవర్గ ప్రజలు సమస్యలపై మిమ్మల్ని కలవడానికి వస్తే తండ్రి కొడుకులు దాగుడుమూతల ఆట ఆడుతున్నారన్నారు.  మీ గెలుపు కోసం పనిచేసిన మీ నాయకులు కార్యకర్తలే మీ గెలుపు తర్వాత మీ వ్యవహార శైలిపై బహిరంగంగా మండిపడుతున్నారని గుర్తు చేశారు. మీరు గెలిచిన ఏడు నెలల్లోనే ఇసుక మాఫియా కోట్లు సంపాదించి, అక్రమ వసూళ్లపై దృష్టి పెట్టారు. గ్రామాల్లో మా కార్యకర్తలను వేధిస్తున్నారని, నియోజకవర్గ ప్రజలందరూ అన్ని గమనిస్తున్నారన్నారు. ఎవరు ప్రజల కోసం పనిచేశారో ఎవరు సొంత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారో అన్ని గమనిస్తున్నారన్నారు. ఇకనైనా ఈ దుర్మార్గ పనులు మానుకొని ప్రజలకు మంచి చేయాలని ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు.