పాలస్తీనా సంఘీభావానికి చిహ్నంగా భావించి వాటర్ మిలన్ , శాంతి చిహ్నాలు ఆ బ్యాగ్ ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ హ్యాండ్ బ్యాగ్ ఇప్పుడు వైరల్ గా మారింది. దాని పై పాలస్తీనా అని రాసి ఉండడంతో లోక్ సభకు హాజరయ్యారు. పాలస్తీనా సంఘీభావానికి చిహ్నంగా భావించి వాటర్ మిలన్ , శాంతి చిహ్నాలు ఆ బ్యాగ్ ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ బ్యాగ్ తో పార్లమెంట్ ఆవరణ లో ప్రియాంక దిగిన ఫొటో వైరల్ అవుతుంది. ఈ పిక్ ను కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామా మహమ్మద్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.
ప్రియాంక గాంధీ తీసుకెళ్లిన ప్రత్యేక బ్యాగ్... పాలస్తీనాకు ఆమె మద్దతు, సంఘీభావాన్ని చూపుతోందని, కరుణ, న్యాయం, మానవత్వం పట్ల నిబద్ధతకు ఇది చిహ్నం అని షామా పేర్కొన్నారు. దీంతో జెనీవా ఒప్పందాన్ని ఎవరూ ఉల్లంఘించలేరని ఆమె క్లియర్ గా స్పష్టం చేశారు.
ప్రియాంక గాంధీ ఆ బ్యాగ్‌తో కనిపించడంపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ప్రజలు పట్టించుకోనపుడు ఇలా ఏదో ఒక విషయంపై వారిని వారు గుర్తించే పనులు చేస్తారని ...ఏదో ఒకటి చేస్తేనే జనాలు మాట్లాడుకునేలా చెయ్యడానికి ఏదో ప్రయత్నిస్తారని తెలిపారు. గాంధీ కుటుంబం ఎప్పుడూ బుజ్జగింపుల సంచిని మోస్తుంటుందని బీజేపీ నేత సంబిత్ పాత్ర విమర్శించారు. ఎన్నికల్లో వారి ఓటమికి బుజ్జగింపుల సంచే కారణమని చురక అంటించారు.