నిజానికి చాలా వరకు ప్రతి కంట్రీ కోసం ఎంతో కొంత క్యూరియాసిటీ ఉంటుందిగా. అలా పాకిస్థాన్ వాళ్లు భారత్ గురించి ఏం తెలుసుకుంటున్నారో చూద్దాం.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: 2024 మరో 15 రోజులు అంతే..కొత్త ఏడాది మొదలవుతుంది. అందుకే గూగుల్ తన సెర్చ్ ఇంజిన్ గూగుల్ 'ఇయర్ ఇన్ సెర్చ్' ట్రెండ్స్ ను విడుదల చేసింది. ఎప్పుడు ఇండియా కబుర్లేనా ..అసలు పాకిస్థాన్ ప్రజలు భారత్ గురించి ఏం తెలుసుకుంటున్నారు. ఏం సెర్చ్ చేస్తున్నారనేది రిలీజ్ చేసింది.యవీటిని ఆరు కేటగిరీలుగా విభజించింది. నిజానికి చాలా వరకు ప్రతి కంట్రీ కోసం ఎంతో కొంత క్యూరియాసిటీ ఉంటుందిగా. అలా పాకిస్థాన్ వాళ్లు భారత్ గురించి ఏం తెలుసుకుంటున్నారో చూద్దాం.
* మనం గెస్ చేసేదే ...క్రికెట్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇండియన్ క్రికెటర్స్ పై కాస్త ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.. టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్-భారత్ మ్యాచ్, భారత్ వర్సెస్ ఇంగ్లండ్, భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా, భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్ ల గురించి పాకిస్థానీలు గూగుల్ లో బాగా సెర్చ్ చేశారట.
* రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ గురించిత తెలుసుకునేందుకు పాకిస్థాన్ ప్రజలు విపరీతమైన ఆసక్తి చూపించారని గూగుల్ వెల్లడించింది. అంబానీ కొడుకు పెళ్లిని ఎక్కువ మంది సెర్చ్ చేసి మరీ చూశారట. గ్రాండ్ వెడ్డింగ్ కదా ఆ మాత్రం ఉంటుంది.
* భారతీయ సినిమాలకు పాకిస్థాన్ లో పిచ్చ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సినిమాలంటే పాకిస్థాన్ వాళ్లు పడిచస్తుంటారు. ఈ క్రమంలో హీరా మండీ, ట్వల్త్ ఫెయిల్ వంటి సినిమాలు... మీర్జాపూర్ సీజన్ 3 షోస్ సూపర్ డూపర్ గా చూస్తుంటారు.
* ఇండియన్ రెసిపీస్ కూడా పాకిస్థానీలు బాగా సెర్చ్ చేస్తున్నారట. బిర్యానీ ..స్వీట్స్ ..చికెన్ రెసీపీ లను ఎక్కువ జనాలు ఇష్టపడుతుంటారు. సో ఎక్కువగా అవి కూడా వెతుకుతారు.
అదే పాకిస్థాన్ గురించి భరాత్ మాత్రం ఏం చెక్ చెయ్యలేదట. జనాలు వాళ్లంతట వాళ్లు పాకిస్థాన్ గురించి ఏం తెలుసుకోవాలనుకోవడం లేదట. 2024 లో పాకిస్థాన్ జోలికే పోలేదట భారతీయులు.