Cyclone Chido: ఫ్రాన్స్‌ను అతలాకుతలం చేసిన ‘చిడో’ తుపాను..వైరల్ అవుతున్న వీడియో !

ఈ తుఫాను కారణంగా కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులు కూడా వేలల్లో ఉండొచ్చని తెలిపారు.


Published Dec 16, 2024 03:24:09 AM
postImages/2024-12-16/1734340991_rain11.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: హిందూ మహాసముద్ర ద్వీప సమూహంలోని మయోట్ ను తాకిన అత్యంత శక్తివంతమైన తుఫాను చిడో  వేలాదిమంది ప్రాణాలు బలికొంది. గత శతాబ్ధకాలంలో ఇది చాలా పెద్ద తుఫాను అని చెబుతున్నారు ఫ్రెంచ్ అధికారులు . తనకు తెలిసినంత వరకు ఈ తుఫాను కారణంగా కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులు కూడా వేలల్లో ఉండొచ్చని తెలిపారు.


చిడో తుపాను రాత్రికి రాత్రే మయోట్‌ను తాకినట్టు చెప్పారు. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల కారణంగా ఇళ్లు, ప్రభుత్వ భవనాలు, ఆసుపత్రులు దెబ్బతిన్నట్టు వివరించారు. దాదాపు వందేళ్ల కాలంలో ఇదే బలమైన తుఫాను గా ఫ్రెంచ్ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.


నిజం చెప్పాలంటే తాము విషాదాన్ని అనుభవిస్తున్నామని, అణుయుద్ధం తర్వాత ఉండే పరిస్థితులు ఇక్కడ ఉన్నాయని మయోట్ రాజధాని మమౌద్జౌ నివాసి ఒకరు తెలిపారు. ఏరియల్ వ్యూ పిక్స్ తో పాటు సోషల్ మీడియాలో జరిగిన నష్టానికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. మృతుల కుటుంబాలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ సంతాపాన్ని తెలిపారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu heavy-rains

Related Articles