టైమ్ లోనే రూ. 1000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా పుష్ప 2 సినిమా గురించే చర్చ జరుగుతోంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: వేణు స్వామి మరోసారి ఇండస్ట్రీ షేకింగ్ విషయాలు మాట్లాడారు. అల్లు అర్జున్ జోస్యం చెబుతూ మరో సారి షాకింగ్ కామెంట్లు చేశారు. పుష్ప సక్సస్ రావడంతో అల్లు అర్జున్ స్టార్ హీరో అయిపోయాడు. అతి తక్కువ టైమ్ లోనే రూ. 1000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా పుష్ప 2 సినిమా గురించే చర్చ జరుగుతోంది.
పుష్ప 2 తోనే కాదు ...వేణుస్వామి కామెంట్లతో కూడా అల్లు అర్జున్ ఫుల్ వైరల్ అయిపోతున్నాడు. వేణుస్వామి ఏం చెప్పారంటే ..బన్నీ రాజకీయాల్లోకి వస్తున్నాడని, కొత్త పార్టీ స్థాపించనున్నాడని ప్రచారం జరుగుతోంది. జైలుకి వెళ్లిన వారంతా సీఎంలు అవుతున్నారు. అలా అల్లు అర్జున్ కూడా త్వరలోనే కచ్చితంగా సీఎం అయ్యే చాన్స్ ఉంది. 100 శాతం ఆయన కచ్చితంగా పొలిటికల్ పార్టీ పెడతాడు’ అంటూ జోస్యం చెప్పాడు.
అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయాన్ని ఫుల్ వైరల్ చేస్తున్నారు. ‘అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రావడం లేదు. సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని. దయచేసి ఇలాంటి అసత్యపు వార్తలను ఎంకరేజ్ చేయవద్దని అభ్యర్థిస్తున్నామంటూ అల్లు అర్జున్ టీం అప్పట్లో తెలిపింది. అలాంటి రోజు వస్తే కంపల్సరీ అధికారిక ప్రకటన వస్తుందని ఇప్పట్లో అసలు ఆ ఆలోచన కూడా ఇప్పట్లో లేదని అల్లు అర్జున్ టీం తెలిపారు.