మధ్యంతర బెయిల్ ఇవన్నీ చకా చకా జరిగిపోయాయి. అయితే ఈ కేసులో బన్నీ ని సినీ ప్రముఖులంతా పరామర్శించారు
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : సంధ్య థియేటర్ లో జరిగిన అల్లు అర్జున్ జైలు కు వెళ్లడం ..మధ్యంతర బెయిల్ ఇవన్నీ చకా చకా జరిగిపోయాయి. అయితే ఈ కేసులో బన్నీ ని సినీ ప్రముఖులంతా పరామర్శించారు. తాజాగా సీనియర్ నటుడు సుమన్ బన్నీ అరెస్ట్ పై స్పందించారు. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం చాలా తప్పని మండిపడ్డారు.
‘అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం ముమ్మాటికి తప్పే. హీరోని పిలిచినప్పుడు సెక్యూరిటీ బాధ్యత థియేటర్ యాజమాన్యం తీసుకోవాలి. క్రౌడ్ కు తగ్గట్లుగా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలి. తన సినిమా ను తాను తన ఫ్యాన్స్ తో చూడాలనుకోవడం తప్పు కాదు. దీనికి థియేటర్ రెడీ గా లేకపోవడం తప్పు అన్నారు సుమన్.
ఇది చాలా బాధగా ఉంది. కాని ఇందులో అర్జున్ తప్పు లేదంటూ ట్వీట్ చేశారు. గతంలో అనేక ఘటనలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వాటి గురించి ఎందుకు మాట్లాడరు. వాళ్లకో రూలు.. అల్లు అర్జున్ కు ఒక రూలా’ ఇదేం లా అన్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి..దీన్నే ఎందుకు పెద్దది చేస్తున్నారో అర్ధం కావడం లేదంటు తెలిపారు.