ఈజీ మనీ కోసం అలవాటు పడిన నిందితులు నార్కోటిక్ డ్రగ్స్ ను విక్రయించాలని ప్లాన్ చేసినట్లు తెలిపారు రాచకొండ పోలీసులు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : డ్రగ్స్ ప్రీ తెలంగాణే లక్ష్యమంటుంది రాష్ట్ర ప్రభుత్వం . అయితే రోజు రోజుకు డ్రగ్స్ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా మీర్‌పేట్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడడం కలకలం రేపుతోంది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మీర్‌పేట్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు. వారి నుంచి 53 కేజీల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
ఈజీ మనీ కోసం అలవాటు పడిన నిందితులు నార్కోటిక్ డ్రగ్స్ ను విక్రయించాలని ప్లాన్ చేసినట్లు తెలిపారు రాచకొండ పోలీసులు. ఇందులో భాగంగా రాజస్థాన్‌కు చెందిన మంగీలాల్, బిష్ణోయ్ మంకీలాల్ దాకా రామ్ ముగ్గురు నిందితులు మధ్యప్రదేశ్‌కు చెందిన పింటూ అనే వ్యక్తి నుంచి పప్పీస్ట్రా మాదకద్రవ్యాలని తక్కువ ధరకు కొనుగోలు చేసి హైదరాబాదులో విక్రయిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ డ్రగ్స్ విక్రయాన్ని పక్కా సమాచారంతో నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు.
ఈ డ్రగ్స్ ను లారీలు , బస్సులు , ట్రైన్స్ ద్వారా నగరానికి తీసుకువస్తున్నట్లు తెలిపారు. 2023లో మంకీలాల్ బిష్ణోయ్‌ను హయత్ నగర్ పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్టు చేసినట్టు సీపీ తెలిపారు. మంకీలాల్ పై పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తామని సీపీ తెలిపారు. ఎవరో ముగ్గురు రిసీవర్స్ కూడా ఉన్నారని తెలిపారు. ఈ పప్పీస్ట్రాను పాలు వాటర్, ఛాయ్‌లో కలుపుకుని తాగుతారు. ఇది డ్రగ్స్ అనే అనుమానం కూడా ఎవ్వరికి రాదని తెలిపారు. అలవాటు ఉన్నవారు...డ్రగ్స్ గురించి తెలిసిన వారు మాత్రమే వీటిని గుర్తించగలరని తెలిపారు.