ఎన్ని టెన్షన్స్ లో ఉన్నా ... సినిమా మాత్రం బాగా అప్ డేట్ చేస్తున్నారు. ఇందులో నటిస్తున్న మోహన్ లాల్ పాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మంచు ఫ్యామిలీ గొడవల కారణంగా వార్తల్లో నిలుస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే మంచు ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ కన్నప్ప నుంచి అప్ డేట్స్ మాత్రం ఇస్తూనే ఉన్నారు. ఎన్ని టెన్షన్స్ లో ఉన్నా ... సినిమా మాత్రం బాగా అప్ డేట్ చేస్తున్నారు. ఇందులో నటిస్తున్న మోహన్ లాల్ పాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
మైథలాజీ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న చిత్రాన్ని దాదాపు రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ముఖేశ్‌కుమార్ సింగ్ డైరక్షన్ లో ఈ సినిమా మేకింగ్ జరుగుతుంది. ఈ మూవీలో ప్రభాస్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ లాంటి బడా క్రూ ఉంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి మంచు మోహన్ బాబు, మంచు విష్ణులతో పాటు ఇంపార్టెంట్ పాత్రలను ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేసేశారు.
ఇప్పుడు మలయాళం స్టార్ నటుడు మోహన్ లాల్ ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ మూవీలో ఆయన 'కిరాట' అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్టు మేకర్స్ తెలిపారు. ఇక తాజాగా విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో చూడటానికి ఆయన చాలా గంభీరంగా కనిపిస్తున్నారు.