R Krishnaiah: గ్రూప్స్, టీచర్ పోస్టులు పెంచాలి 2024-06-20 17:17:42

న్యూస్ లైన్ డెస్క్: గ్రూప్స్, టీచర్ పోస్టులు 25వేలకు పెంచాలని, గ్రూపు-1లో వ్రాత పరీక్షకు 1:100 ప్రకారం అవకాశం కల్పించాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. గురువారం నిరుద్యోగుల డిమాండ్లకై ఇందిరా పార్క్ వద్ద 5వేల మంది నిరుద్యోగులతో భారీ ధర్నా నిర్వహించారు. ఈ 5వేల మందితో జరిగే మహాధర్నాకు రాష్ట్ర నిరుద్యోగ మహాధర్నా ఛైర్మన్ నీల వెంకటేష్, నిరుద్యోగ నాయకులు అశోక్ - అన్వర్ నాయకత్వం వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం 2 లక్షల ఉద్యోగాల భర్తీకై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. గ్రూప్-1 సర్వీస్ కింద 503 పోస్టులు ప్రకటించారని, కానీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోట పోస్టులు కరెక్టుగా లెక్కిస్తే 1600కు, గ్రూప్-2 సర్వీస్ కింద 783 పోస్టులు భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారన్నారు. వీటిని కూడా కరెక్ట్‌గా లెక్కిస్తే 2200 లకు, గ్రూప్-3 పోస్టులు 1383 ప్రకటించారు. కానీ వాస్తవంగా 3వేలకు పైగా ఉంటుందని, గ్రూప్-4 సర్వీస్ కోటా కింద 8500 పోస్టులు ప్రకటిస్తే ఇవి 25 వేలకు పైగా ఉంటాయని ఆయన తెలిపారు. టీచర్ పోస్టులు 11వేలు ప్రకటించారు. పీఆర్‌సీ రిపోర్ట్ ప్రకారం 25వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నయిని పేర్కొన్నారు.

రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ 23 జిల్లాలోని వాటిలో 40 శాఖల జిల్లా ఆఫీసులు, తాలూకా ఆఫీసులు ఏర్పడ్డాయి. అలాగే 131 మండలాలు, 30 రెవెన్యూ డివిజినల్ ఆఫీసులు, 76 మున్సిపాలిటిలు, 7 మున్సిపల్ కార్పోరేషన్లు, 25 డీఎస్పీ ఆఫీసులు, 31 పోలీస్ సర్కిల్స్, 7 పోలిస్ కమిషనరేట్లు, 4,383 గ్రామపంచాయతీలు కొత్తగా ఏర్పడ్డాయి. ఇందులో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 సర్వీస్ పోస్టులు పెద్ద ఎత్తున ఏర్పడ్డాయి. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలకు, మండలాలకు మున్సిపాలిటీలకు కొత్త పోస్టులు మంజూరు చేయలేదు. వీటిని వెంటనే మంజూరు చేయాలి. ఇందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా లెక్కించాలి. వాటిలో గ్రూప్-I కు 50 శాతం, గ్రూప్-2 లో 30 నుంచి 40 శాతం పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద ఎన్ని పోస్టులు వస్తాయో పూర్తి స్థాయిలో లెక్కించి భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

ఒకే దఫా గ్రూప్ 1-2-3-4 అలాగే టీచర్, లెక్చరర్, ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ చేస్తున్నందున మెరిట్ అభ్యర్థులు ఈ పోస్టులన్నింటికీ సెలెక్ట్ అవుతారన్నారు. అన్ని రకాల 6-7 కేటగిరీల పోస్టులకు ఒకేసారి సెలెక్ట్ అయితే ఆ అభ్యర్థి ఒకే పోస్టుల ఎంపిక చేసుకుంటారు. మిగతా 5 -6 రకాల పోస్టులు మిగిలిపోతాయి అన్నారు. ఇప్పుడున్న పద్దతి ప్రకారం ఇతర అభ్యర్థులకు రాకుండా పోతాయని, ఎందుకంటే వెయిటింగ్ లిస్టు పద్దతి లేదన్నారు. వెయిటింగ్ లిస్టు కాల పరిమితి ప్రవేశపెట్టి పోస్టుల భర్తీ చేస్తే అందరికీ అవకాశం వస్తుందన్నారు. పోస్టులు మిగిలిపోకుండా భర్తీ అవుతాయని, అలాగే టీచర్ పోస్టుల ఈ విషయంలో ప్రభుత్వ పాఠశాలల పోస్టులు, ఎస్సీ/ఎస్టీ/బీసీ/మైనారిటీ గురుకుల పాఠశాల పోస్టులు, ఆదర్శ పాఠశాల పోస్టులు కూడా వేరువేరుగా జరపడంతో మెరిట్ అభ్యర్థులు ఈ మూడు నాలుగు రకాల యాజమాన్యాల పాఠశాలలో మెరిట్ ఉన్న ఒకే అభ్యర్థి సెలెక్ట్ అవుతారన్నారు. ఒకే యాజమాన్యం పాఠశాలలో జాయిన్ అవుతారని, సెలెక్ట్ అయిన మిగతా మూడు వృధా అవుతుందన్నారు. అందుకే ఆప్షన్ పద్ధతి పెట్టడం, వెయిటింగ్ లిస్ట్ పెట్టడం, అన్ని ఫలితాలు ఒకేసారి ప్రకటించడం లాంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సుచించారు.

కొత్త తరాన్ని – యువతరాన్ని డైరెక్టు రిక్రూట్ మెంట్ ద్వారా ప్రభుత్వ యంత్రాంగంలోకి తీసుకువస్తే సమర్థవంతమైన, అవినీతికి తావులేని పాలన లభిస్తుంది. యువత శక్తి-యుక్తులు సమాజాభివ్రుద్దికి ఉపయోగించ వచ్చును. యువతను పాలనరంగం లోకి తీసుకువస్తే ఉత్సాహంతో, అంకిత భావంతో నిజాయితీగా పని చేస్తారు. ముఖ్యమంత్రి ఒకే దఫా 2లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఆదేశాలు జారీ చేయడం గొప్ప విషయం. ప్రస్తుతం ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చునది ఏమనగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కొందరు డైరెక్ట్ రిక్రూట్ మెంట్ కోటా క్రింద భర్తీ చేయవలిసిన గ్రూప్-1,2,3,4 సర్వీస్ ఉద్యోగాలను సరిగ్గా పూర్తి స్థాయిలో లెక్కించి – గణన చేసి భర్తీ చేయడానికి ప్రతిపాదనలు పంప లేదన్నారు. ఎదో నామమాత్రంగా లేక్కిoచి ప్రతిపాదనలు పంపారు. ఇప్పటికే అన్ని శాఖలలో అడ్ హక్ ప్రమోషన్ల పేరుమీద భర్తీ చేశారు. కొందరు ఉన్నతాదికారులు డైరెక్టు రిక్రూట్ మెంట్ లెక్కించడంలో అన్యాయం చేస్తున్నారు. డైరెక్టు రిక్రూట్ మెంట్ కోటా పోస్టులను ప్రమోషన్ల క్రింద భర్తీ చేశారని ఆరోపించారు.