రాజ్యసభ పోరుకు బీఆర్ఎస్ ప్లాన్ ?

తెలంగాణలో రాజ్యసభ సీట్ల రేసు రసవత్తరంగా మారనుంది. ఖాళీ అయిన రెండు రాజ్యసభ సీట్లు.. ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం గెలుపు మాదే అంటోంది అధికార కాంగ్రెస్. రాజ్యసభ సీటుకు కావాల్సిన బలం లేకున్నా.. సరికొత్త వ్యూహానికి తెరలేపుతుంది బీఆర్ఎస్. ఇది కాస్త ఆసక్తికరంగా మారింది. గెలుపోటములతో సంబంధం లేకుండా రాజకీయంగా కలిసి వచ్చే అంశాలపై గులాబీ బాస్ కేసీఆర్ దృష్టి పెట్టారన్న గుసగుసలు పొలిటికల్ సర్కిళ్లలో చక్కర్లు కొడుతోంది. ఇంతకు కేసీఆర్ చేస్తోన్న ప్లాన్ ఏంటీ..?


Published Mar 03, 2026 12:36:54 PM
postImages/2026-03-03/1772521614_BRSPLANRSELECTIONS.jpg

తెలంగాణ రాజ్యసభ ఎన్నికల చదరంగంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ ఎత్తుగడలకు పదును పెడుతున్నాయి. సంఖ్యాబలం తక్కువగా ఉన్నా సరే పోటీకి దిగడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని బీఆర్ఎస్ భావిస్తుండగా, క్లీన్ స్వీప్ చేయాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీలోని మొత్తం 119 మంది ఓటు హక్కు వినియోగించుకుంటే.. ఒక్కో రాజ్యసభ సీటు గెలుచుకునేందుకు 40 ఓట్లు అవసరం పడుతుంది. ఈ లెక్కన రెండు రాజ్యసభ స్థానాలకు 82 మంది ఎమ్మెల్యేల బలం కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు దూరంగా ఉండే అవకాశం ఉంది. అప్పుడు ఒక్కో రాజ్యసభ సీటు గెలవాలంటే 38 ఓట్లు అవసరం కానున్నాయి. రెండు రాజ్యసభ స్థానాలకు 76 మంది మద్దతు తెలపాల్సి ఉంటుంది. కాంగ్రెస్‌కు 66 మంది ఎమ్మెల్యేలు ఉండగా..ఏడుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఒక సీపీఐ సభ్యునితో కలిపి 74 మంది అవుతారు. కోటా సరిపోకపోతే రెండో ప్రాధాన్యత ప్రాధాన్యత ఓట్లు, ఆ తర్వాత తొలగింపు ప్రక్రియ చేపట్టడంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల ఓట్లు కీలకం అవుతాయి.

స్పాట్:

వాయిస్: 2

మరోవిధంగా చూసుకుంటే అధికార కాంగ్రెస్ పార్టీకి సీపీఐతో కలిపితే 67 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఎంఐఎం మద్దతు లేకపోయినా జంపింగ్‌ ఎమ్మెల్యేలను కలిపితే అప్పుడు హస్తం పార్టీ బలం 76కు చేరుతుంది. అప్పుడు ఈజీగా రెండు రాజ్యసభ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. పార్టీ మారిన ఆ పది మంది ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ పార్టీ విప్ జారీ చేసినా.. అనర్హత వేటు వేసే అవకాశం లేదు కాబట్టి పెద్దగా ఇబ్బందేం ఉండదని హస్తం పార్టీ పెద్దలు భావిస్తున్నారట. ఇదే సమయంలో అయితే రాజ్యసభ రేసులో నిలిచే విషయంలో బీఆర్ఎస్ లెక్కలు మరోలా ఉన్నాయట. రికార్డుల ప్రకారం బీఆర్ఎస్ బలం 37గా ఉంది. ఇందులో 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరిపోయారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హస్తం పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. మహిపాల్ రెడ్డిని మినహాయిస్తే మిగతా 9 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీతోనే కొనసాగుతున్నారు. అంటే ప్రస్తుతం బీఆర్ఎస్‌కు గూడెం మహిపాల్‌రెడ్డితో కలిపి 28 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు.

స్పాట్: 

వాయిస్: 3

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెట్టడం కూడా ఈ పోటీ వెనుక ఉన్న మరో ఉద్దేశం. రాజ్యసభ ఎన్నికల ప్రక్రియలో పార్టీలు విప్ జారీ చేసే అధికారం కలిగి ఉంటాయి. అయితే, ఓటింగ్ రహస్య బ్యాలెట్ పద్ధతిలో జరుగుతుంది. ఎవరు ఎవరికి ఓటు వేశారనేది పార్టీ ఏజెంట్లకు స్పష్టంగా తెలుస్తుంది. పార్టీ ఆదేశాలను ఉల్లంఘించి ఓటు వేస్తే పదవి పోతుందనే భయం ఒకవైపు, సొంత పార్టీకి వ్యతిరేకంగా వెళ్లలేని పరిస్థితి మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేలను వెంటాడుతున్నాయి. విప్ ఉల్లంఘనపై అనర్హత వేటు పడుతుందా లేదా అనే అంశంపై సుప్రీంకోర్టులో గతంలో భిన్నమైన తీర్పులు ఉన్నా, రాజకీయంగా వారిని దోషులుగా నిలబెట్టాలని బీఆర్ఎస్ ఆశిస్తోంది.

స్పాట్:

వాయిస్: 4

అయితే.. 28 మంది ఎమ్మెల్యేలున్న బీఆర్ఎస్ పార్టీ.. మైనార్టీ అభ్యర్థిని బరిలోకి దించే ఆలోచన చేస్తుందట. మైనార్టీ క్యాండిడేట్‌ను పెట్టి ఎంఐఎం మద్దతు కోరే అవకాశం ఉందట. మైనార్టీ అభ్యర్థికి ఎంఐఎం సపోర్ట్ చేయకపోతే ఆ పార్టీ తీరును ఎక్స్‌పోజ్ చేయొచ్చని భావనలో కారు పార్టీ నేతలు ఉన్నారట. ఇక జంపింగ్‌ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేస్తే.. వారు ఎవరికి ఓటేస్తారో మరోసారి స్పష్టం కానుందని.. వాళ్లను కూడా మళ్లీ ఇరకాటంలో పెట్టేలా ప్లాన్ చేస్తోందట బీఆర్ఎస్ పార్టీ.

స్పాట్:

వాయిస్: 5

కాంగ్రెస్ లోని అసమ్మతి నేతలు, మైనార్టీ అభ్యర్థి పట్ల సానుభూతి ఉన్నవారు తమకు ఓటు వేస్తారని బీఆర్ఎస్ ఆశిస్తోంది. ఇది కేవలం గెలుపు కోసం చేసే ప్రయత్నం కంటే కూడా, కాంగ్రెస్ పార్టీలో చీలికలు ఉన్నాయని నిరూపించడానికి చేసే ఒక రాజకీయ ప్రయోగమని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ లోని మైనార్టీ ఎమ్మెల్యేలు లేదా ఇతర నేతలు ఈ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తే అది బీఆర్ఎస్‌ కు పెద్ద విజయంగా మారుతుంది. ఈ రాజ్యసభ ఎన్నికలు కేవలం సభ్యుల ఎంపికతో ముగిసేవి కావు. వీటి ఫలితం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ప్రభావం చూపుతుందంటున్నారు. మైనార్టీ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి కాంగ్రెస్ పడే తపన, వారిని ఇబ్బంది పెట్టడానికి బీఆర్ఎస్ వేసే ఎత్తుగడలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తాయంటున్నారు. అభ్యర్థుల ఖరారు నుండి ఓటింగ్ ముగిసే వరకు ప్రతి అడుగు అత్యంత కీలకంగా మారనుంది. అంతిమంగా ఈ యుద్ధం సంఖ్యాబలానికి, సామాజిక వ్యూహాలకు మధ్య జరుగుతున్న పోరాటంగా మిగిలిపోనుంది. దీంతో బీఆర్ఎస్ రాజ్యసభ రేసులో నిలుస్తుందా..? ఒకవేళ గులాబీ పార్టీ క్యాండిడేట్‌ను పెడితే ఈక్వేషన్స్ ఎలా ఉంటాయో చూడాలి మరి..

 

newsline-whatsapp-channel
Tags : kcr brs tspolitics ktr harish-rao raja-saab election- political-leaders brs-elections-plan-

Related Articles