మూసీ రివర్ వెనుక పెద్ద స్కెచ్ ?

మూసీ సుందరీకరణ పేరుతో బిగ్ ప్లాన్ కు స్కెచ్ వేశారా..? పేరుకే గాంధీ సరోవరం ప్రాజెక్టా..? దాని వెనకాల అసలు మ్యాటర్ వేరు ఉందా..? ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ముందుకు పోతుంది. దీని వెనకాల రేవంత్ రెడ్డి అసలు రూపం ఏంటీ..?


Published Mar 04, 2026 02:11:00 PM
postImages/2026-03-04/1772612548_MUSIRIVERBACKBIGPLAN.jpg

మూసీ సుందరీకరణ పేరిట తెలంగాణ ప్రభుత్వం తెరవెనకాల చాలా చేస్తున్నట్టు తెలుస్తోంది. పేరుకే ప్రక్షాళ, గాంధీ సరోవరం ప్రాజెక్టులు కానీ, దాని వెనకాల భూ మాయ దాగి ఉన్నట్టు తెలుస్తోంది. మూసీ పేరిట రేవంత్ సర్కార్ ఏకంగా 25 వేల ఎకరాలు చెరబట్టాలని భావిస్తోంది. మూసీ ప్రక్షాళనకు ఏడాదిలోనే లక్షన్నర కోట్లకు పెంచింది.

మూసీ సుందరీకరణ పేరు మీద రేవంత్ చేస్తున్న భూదోపిడీకి అంతేలేకుండా పోతుంది.. తొలుత ఈ లూటీ విలువ లక్షన్నర కోట్లని అందరూ అనుకున్నారు. కానీ, ఇప్పుడు భూసేకరణ మొదలయ్యి, ఒక్కో విషయం బయటికి వస్తుంటే మీడియా వర్గాలు, రాజకీయ వర్గాలకు దిమ్మతిరుగుతోందట. దేశ చరిత్రలోనే ఇంత పెద్ద లూటీ ప్రాజెక్టు మరొకటి లేదని చెప్పుకుంటున్నారు. తాజా అంచనాల ప్రకారం మూసీ సుందరీకరణ పేరు మీద రేవంత్ ప్రభుత్వం సుమారు 25 వేల ఎకరాలు సేకరించాలని టార్గెట్‌ గా పెట్టుకుందట. దీని విలువ బహిరంగ మార్కెట్‌లో అక్షరాలా 25 లక్షల కోట్లు ఉంటుందని తెలుస్తోంది.  మూసీ బఫర్ జోన్ పేరిట నదికి సమీపంలో ఉన్న వేల ఎకరాలను చెరబట్టేందుకు ప్లాన్ వేశారట. దాని కోసం ముందుగానే భారీ స్కెచ్ వేశారట. అందులో భాగంగానే ఆయా భూములు, ఇళ్ల రిజిస్ట్రేషన్ నిలిపివేసి, వాళ్లు ఇంకెక్కడా అమ్ముకోకుండా వారిని పద్మవ్యూహంలో కట్టడి చేసి, వాటిని కారుచౌకగా కొట్టేయాలని రేవంత్ ఎండ్ బ్రదర్స్ ప్లాన్ చేశారని టాక్ నడుస్తోంది.

 

అలా సేకరించిన భూమిలో 120 కోట్ల చదరపు అడుగుల నిర్మాణాలు చేపట్టాలని ప్లాన్ చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతుల దగ్గరి నుంచి, పేదలు, మధ్యతరగతి నుంచి సేకరించిన భూములను అంతర్జాతీయ కంపెనీలకు కట్టబెట్టి అందులో ఫైవ్ స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లు, వ్యాపార సముదాయాలు, షాపింగ్ మాల్స్, ఆంఫీ థియేటర్లు, ఇతర వినోద కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్లాన్. అంతర్జాతీయ కంపెనీలకు కట్టబెట్టి నైట్ ఎకానమీ డెవలప్ చేయాలని ప్లాన్ చేస్తోంది. దీంతో అలా చేసి రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపుతున్నారట. రియల్ ఎస్టేట్ వ్యాపారులు దోచిపెట్టేందుకు మూసీ పేరిట కాంగ్రెస్ లక్షన్నర కోట్లు మింగే ప్లాన్ చేస్తున్నట్టు టాక్.

 

మరోవైపు.. మూసీ సుందరీకరణ పనులను ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వంలో చేసిన విధంగా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో ఒక్క ఇల్లు కూల్చకుండా, ఒక్క ఇటుక కదుప కుండా కేసీఆర్ మూసీ సుందరీకరణ చేసి చూపించారని గుర్తు చేస్తున్నారు. అందుకోసం ఉప్పల్ భగయాత్ ను ఉదాహరణ చూపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం, తన అనుచరులు, అన్నదమ్ములు, కుటుంబ సభ్యులకు కాంట్రాక్టులు ఇవ్వడం కోసం మూసీ పేరుతో స్కామ్ కు తెరలేపారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. ప్రజా వ్యతిరేకత వచ్చినా వెనక్కి తగ్గడం లేదు. హైకోర్టు అక్షింతలు వేసినా.. డీపీఆర్ లేకుండానే లక్షన్నర కోట్ల దోపిడి కోసం వేలాది మందిని బలి చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

newsline-whatsapp-channel
Tags : revanth-reddy brs congress gusagusa political-gusagusa moosi-river-back-big-plan moosi-river- moosi--

Related Articles