కూతురు కోసం కేకే త్యాగం !

పాలిటిక్స్ లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన ఆ రాజ్యసభ మాజీ సభ్యుడు ఇక రాజకీయ ప్రస్థానం చాలనుకుంటున్నారంట. వయోభారంతోనో, రాజకీయాలంటే బోరు కొట్టాయా..? అయితే.. కూతురు కోసం పదవీని వదులుకుంటున్నారా..


Published Mar 04, 2026 01:46:16 PM
postImages/2026-03-04/1772612176_KKSACRIFICE.jpg

జీహెచ్ఎంసీ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ కాంగ్రెస్ మరో బంపర్ ఆఫర్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఆమె కోసం మరో సీటు సిద్ధం చేసి ఉంచారని గాంధీ భవన్ లో చర్చ నడుస్తోంది. విజయలక్ష్మీ ఎప్పుడైనా కీలక బాధ్యతలు చేపట్టవచ్చు అని చర్చించుకుంటుంటున్నారు. జీహెచ్ఎంసీ పాలక గడువు ముగియడంతో ఆమె మాజీగా మారారు. ఎలాంటి బాధ్యతలు చేపట్టలేదు. ఆ మహిళ నేత తండ్రి కే కేశవరావు రాజ్యసభ సీటు వదులుకున్నారట. నాకు రాజకీయం పరంగా మంచి అవకాశాలు వచ్చాయని.. అన్ని అనుభవించాను అని అన్నారు. నాకు పదవులపై ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని చెప్పుకొచ్చారు. రాజ్యసభ సీటు రేసులో ఉన్నట్టు వార్తలను ఆయన ఖండించారు. అందుకోసం ఒక ప్రకటనను కూడా విడుదల చేశారు కేకే. దీని వెనకాల చాలా రకాల కారణాలు ఉన్నాయని కాంగ్రెస్ లో చర్చ నడుస్తోంది.

జీహెచ్ఎంసీ పదవి కాలం ముగియడంతో ఆయన కూతురు గద్వాల విజయలక్ష్మి మాజీ మేయర్ అయ్యారు. ఇక మొన్నటి వరకు మహిళ కమిషన్ చైర్ పర్సన్ గా ఉన్న నేరెళ్ల శారద పదవి కాలం కూడా ముగిసింది. దీతో మహిళ కమిషన్ చైర్ పర్సన్ పదవి ఖాళీగా ఉంది. ఆ పదవి కోసం కాంగ్రెస్ లో రేసు గట్టిగానే ఉంది. అయితే.. ఆ రేసులో నేరెళ్ల శారద ఉన్నట్టు కనిపించడం లేదనే వాదన పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈసారి నేరెళ్ల శారద మహిళా కమిషన్ పోస్ట్ కాకుండా రాజకీయంగా పదవి ఆశిస్తున్నారంట. ఇటు మహిళ కమిషన్ పోస్టుకి కూడా గట్టిగానే పోటీ ఉందట.

 

 

 

గద్వాల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన సరిత తిరుపతయ్య పేరు కూడా వినిపించింది. కానీ, ఆమెకు రాజకీయంగానే ఇంట్రెస్ట్ ఉందని వార్తలు వచ్చాయి. ఇక మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న సునీత రావు పార్టీ పదవి కాకుండా, ప్రభుత్వం పరంగా పోస్ట్ ఆశిస్తున్నారంట. మహిళ కమిషన్ పోస్ట్ పైన సునీతరావు ఇంట్రెస్ట్ గా ఉన్నట్లు పార్టీ వర్గాలో చర్చ నడుస్తోంది. అలాగే కేసీఆర్ అన్న బిడ్డ రమ్య రావు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ లోనే ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడిన్నపాటి నుండి ప్రభుత్వంలో కార్పొరేషన్ పదవి ఆశిస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు మహిళ కమిషన్ పోస్ట్ ఖాళీ అవడంతో రమ్యరావు కూడా ఆ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అధిష్టానం ముందు తమ ప్రపొజల్ పెడుతున్నారు.

 

అయితే.. గద్వాల విజయలక్ష్మి కోసం తండ్రి కేకే చేస్తున్న ప్రయత్నలే సక్సెస్ అయ్యేలా ఉన్నాయంటున్నారు. అధిష్టానం కూడా మాజీ మేయర్‌ కే మహిళ కమిషన్ పోస్ట్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నట్లు గాంధీ భవన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కేకే రాజ్యసభ పదవికి, బీఆర్ఎస్ కి రాజీనామా చేసి హస్తం గూటికి తిరిగి వచ్చారు. అలాగే బీఆర్ఎస్ నుంచి గ్రేటర్ మేయర్‌ గా కొనసాగిన విజయలక్ష్మి తండ్రి బాటలో ప్రభుత్వం వైపుకే వచ్చేశారు. ప్రభుత్వానికి పూర్తి మద్దతుగా నిలిచారు. ఇలా తండ్రి -కుమార్తె ఇద్దరు బీఆర్ఎస్‌ ను కాదని పదవి వదులుకొని ఒక్కరు.. పదవిలో ఉండి ఒక్కరు కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఇప్పుడు గద్వాల విజయలక్ష్మి మహిళ కమిషన్ పదవిపై చాలా ఆశలు పెట్టుకున్నారంట.

మొత్తానికి రాజకీయాల్లో సీనియర్ నాయకుడు తన రాజకీయం అనుభవంతో కూతురు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. తెలంగాణలో ఖాళీ అయిన రెండు రాజ్యసభ రేసులో ఆయన కూడా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. కానీ, ప్రస్తుతానికి తాను ఆలోచన చేయడం లేదని పోటీలో లేనని ప్రకటన చేశారు. అందులో భాగంగానే ముందస్తుగానే రాజ్యసభ రేసు నుంచి తప్పుకొని, మహిళా కమిషన్ పదవి రేసులో కూతురిని ముందు వరసలో ఉంచారన్న టాక్ కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. చూడాలి మరి కేకే త్యాగం ఫలిస్తుందో..? లేదో..? ఎందుకంటే కాంగ్రెస్‌లో ఎపుడు ఏదైనా జరుగుంది కదా.

newsline-whatsapp-channel
Tags : vijayalakshmi ghmcmayor women-commission kk kk-daughter ghmc-mayor-vijayalakshmi women-commission-chairperson-

Related Articles