నెంబర్ టూ నెంబర్ టూ అనుకుంట తిర్గే పొంగులేటి సారు. ఈ నడ్మ నంబర్ వన్ అని మురుస్తున్నడు గదా. కనీ...సార్ తరీఖ చూస్తుంటె. నెంబర్ టూ కెంచి ఏ ఐదుకో ఆరుకో పోతడని కొందరు. గీ తాప కచ్చితంగ నంబర్ వన్ అయితడని ఇంకొందరు అంటుర్రు గదా. ఏందో చూస్తరా.
సార్ కు ఎప్పటి సందో ఉన్నదే గదా. నంబర్ టూ కెంచి నంబర్ వన్ అయితడనే అనుకుంటుర్రట కాంగ్రెస్ పార్టీల గూడ. దాని కోసం సారు గూడ రేవంత్ సార్ తొవ్వల్నే పోతున్నడట. రేవంత్ సారు బ్లాక్ మెయిల్ ప్రచారాలు చేస్తడని ఎర్కనే గదా. గదేనుల్లా. మమ్ముల గెల్పియ్యకుంటె పథకాలు ఆగిపోతయ్. మీకు బియ్యం ఆగొద్దంటె మమ్ముల గెల్పియ్యాలె, ఫ్రీ బస్ ఆగొద్దంటె మమ్ముల గెల్పియ్యాలె అంటడు గదా. అగో గదే చేస్తుండు పొంగులేటి సార్ గూడ. మరి సారేమంటుండో ఇనుర్రి.
వాయమ్మనే...రేవంత్ సార్ ఎన్కపొంటి తిర్గీ తిర్గీ తిర్గీ..సార్ తొవ్వ బగ్గనే అలవాటైనట్లుంది. గదేదో అంటరు గదా. సార్ అడుగు తొక్కినట్లున్నడు అని. అగో అట్లనే చేస్తున్నడు గదా. పొంగులేటి సార్. గెల్పియ్యకుంటె మంచినీళ్లు పంపరా ఎట్ల. అంటే..మంచినీళ్లు వస్తలెవ్వు. బుర్దనీళ్లు వస్తున్నయ్ అని తెల్శిగూడ పంపలేదంటె..జనం మీద ఎంత ప్రేమ సార్. ఎణ్నికలు కాంగనే మన్షిని పంపే అంత బలం ఉండి మరి ఇన్ని దినాలు ఎందుకు పంపలేదు సార్. వాళ్లు మురికి నీళ్లు తాగుతుంటె చూస్కుంట ఎందుకు కూసున్నరు సార్ అంటుర్రు. అంటే...మున్సిపల్ ఎన్నికలకు ముడి పెట్టి మంచినీల్లు ఇస్తం అంటుర్రా. మంచిగున్నయ్ సార్ రాజకీయాలు. అప్పుడు మిమ్ముల ఎమ్మెల్యేలుగ గెల్పిచ్చింది కూడ పన్లు సక్కంగ చేస్తరనే సార్. అప్పుడు చెయ్యకపోతె..ఇప్పుడు మాత్రం ఎట్ల నమ్ముతరో ఇగ జనానికే తెల్వాలె.