vsp: విశాఖ గడ్డపై దిల్లీ గ్రాండ్ విక్టర్టీ ..చిత్తు చిత్తు అయిన హైదరాబాద్ !

హైదరాబాద్ బౌలర్లలో జీషాన్ అన్సారీ మూడు వికెట్లు పడగొట్టాడు.


Published Mar 30, 2025 09:14:00 PM
postImages/2025-03-30/1743349498_telugusamayam.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఐపీఎల్ 2025 లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో దిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 18.4 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. ఈ టార్గెట్ ని దిల్లీ 16 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.ఫాప్‌ డుప్లెసిస్ (50; 27 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ చేయగా ..మరో ఓపెనర్ జేక్ ఫ్రేజర్ జేక్ ఫ్రేజర్ రాణించాడు. కేఎల్ రాహుల్ దూకుడుగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో ఉండలేదు. హైదరాబాద్ బౌలర్లలో జీషాన్ అన్సారీ మూడు వికెట్లు పడగొట్టాడు.


టార్గెట్ రీచ్ అవ్వడానికి ఢిల్లీ ఫస్ట్ స్లో గా ఉన్నా..తర్వాత దూకుడు పెంచింది. షమివేసిన మూడో ఓవర్‌లో 15 రన్స్ రాగా డుప్లెసిస్ వరుసగా సిక్స్, ఫోర్ బాదాడు. క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్.. షమి బౌలింగ్లో వరుసగా 4,6,4 కొట్టాడు. దూకుడుగా ఆడుతున్న రాహుల్‌ని జీషాన్‌ క్లీన్‌బౌల్డ్ చేశాడు. 


టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్‌కు ఆరంభంలో వరుస షాక్‌లు తగిలాయి. జస్ట్ 37 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన కష్టాల్లోపడిన  అనికేత్ వర్మ హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. 
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu delhi vizag cricket-player

Related Articles